2.0 గురించి ప్రతి విషయం సంచలనమే!

ప్రస్తుతం ఇండియా వైడ్ గా సెన్సేషన్ క్రియేట్ చేసిన సినిమా 2.0.రోబో కి సీక్వెల్ గా రూపొందిన ఈ సినిమా ఆడియో లాంచ్ ని దుబాయ్ లోని బుర్జ్ ఖలీఫా లో లో నిర్వహించడంతో ఈ వేడుక కేవలం ఇండియా లోనే కాకుండా చాలా కంట్రీస్ లో ట్రెండింగ్ టాపిక్ గా మారింది. ఈ సినిమాలోని ప్రతి విషయం కూడా ఒక సంచలనంగానే ఉంది.ముందుగా ఈ ప్రతిష్టాత్మక సినిమా రన్ టైం వింటే అందరికి షాక్ తగులుతుంది. 450 కోట్ల ఖర్చుతో రూపొందించిన ఈ సినిమా రన్ టైం కేవలం రెండు గంటల పదినిముషాలు మాత్రమే.

ఇంటర్నేషనల్ మార్కెట్ ని దృష్టిలో పెట్టుకుని ఈ సినిమాని తీర్చిదిద్దుతున్నాడు శంకర్. అందుకే ఈ సినిమాలో కేవలం రెండు పాటలు మాత్రమే ఉన్నాయి. పైగా ఆ రెండుపాటల లెంగ్త్ కూడా పదినిముషాల కంటే తక్కువే ఉంది. ఇక ఈ సినిమా జనవరి 25 న రిలీజ్ అవుతుంది అంటూ ప్రచారం జరుగుతుంది. కానీ ఇప్పడు తెలిసిన కొత్త విషయం ఏంటంటే ఈ సినిమాలో ఉన్న హెవీ గ్రాఫికల్ వర్క్ క్వాలిటీ గా ఇవ్వడానికి ఇంకో నెల రోజులకు పైగా సమయం అడిగారట.

దాంతో ఈ సినిమాని 2018 వేసవిలోనే విడుదల చేసే అవకాశం ఉంది. యూనిట్ నుండి దీనిపై ఎలాంటి అఫిషియల్ అనౌన్స్మెంట్ లేనప్పటికీ ఇదే నిజం అని అంటున్నారు. పైగా ఈ సినిమాని ఒకే టైం లో అన్ని కంట్రీస్ లో,అన్ని లాంగ్వేజెస్ లో రిలీజ్ చేస్తుండడంతో సమ్మర్ సీజన్ బెటర్ ఆప్షన్ అని ఫీల్ అవుతున్నారు.