రోల్‌కి ప్రత్యేకమైన గుర్తింపు

113 రోజుల పాటు ప్రేక్షకులను అలరించిన తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌-2 నిన్న ముగిసింది. అందరూ ఊహించినట్టుగానే కౌశల్‌ విజేతగా నిలిచాడు. ర్యాప్‌ సాంగ్స్‌తో ఆకట్టుకున్న మరో హౌస్‌ మేట్‌ రోల్‌ రైడా చివరి వరకూ వచ్చినా.. ఫైనల్స్‌కు ముందే ఎలిమినేట్‌ అయ్యాడు. హౌస్‌లో ఉన్నన్ని రోజులూ అందరినీ ఎంటర్టైన్ చేసిన వ్యక్తిగా రోల్ రిడాను గుర్తిస్తూ అమెజాన్.. ఓ అవార్డు అందజేసింది. అమెజాన్ ఎంపిక చేసిన సంతోష్ అనే యువకుడు రోల్ రిడాకు ఈ అవార్డు అందజేశాడు. ఫైనల్స్‌కు చేరకపోయినా అందరిలోనూ తనకంటూ ఓ ప్రత్యేకతను నిలుపుకున్నాడు రోల్‌ రైడా