HomeTelugu Big Storiesసైంధవ్ ఓటీటీ హక్కుల డీల్ కుదిరిందన్న నిర్మాత

సైంధవ్ ఓటీటీ హక్కుల డీల్ కుదిరిందన్న నిర్మాత

Saindhav movie OTT rights dసీనియర్ నటుడు వెంకటేశ్ హీరోగా నటించిన సైంధవ్ చిత్రం రిలీజ్‍కు రెడీ అవుతోంది. యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందించిన ఈ సినిమాను సంక్రాంతి సందర్భంగా జనవరి 13న థియేటర్లలో రిలీజ్ చేస్తున్నారు.

హిట్ ఫేమ్ డైరెక్టర్ శైలేశ్ కొలను ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. ఇప్పటికే రిలీజైన సైంధవ్ మూవీ ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. తండ్రీకూతుళ్ల సెంటిమెంట్‍తో ఆసక్తికరంగా సాగింది. సైంధవ్‍పై అంచనాలు ఓ రేంజ్‌లో ఉన్నాయి.

సైంధవ్ మూవీ గురించి నిర్మాత వెంకట్ బోయినపల్లి అప్‌డేట్ ఇచ్చారు. సైంధవ్ మూవీ ఓటీటీ హక్కుల డీల్ కుదిరిందని అన్నారు నిర్మాత వెంకట్. ఓటీటీ స్ట్రీమింగ్ హక్కులను అమెజాన్ ప్రైమ్ ప్లాట్‍ఫామ్‍కు ఇచ్చినట్టు వెల్లడించారు.

నెట్‍ఫ్లిక్స్ కూడా పోటీ పడినా చివరికి అమెజాన్‍కు ఇచ్చినట్టు తెలిపారు. థియేట్రికల్ రన్ పూర్తయ్యాకే ఓటీటీలోకి వస్తుందన్నారు. సైంధవ్‌ను భారీ బడ్జెట్‍తోనే రూపొందించామని, ఖర్చులో ఎక్కడా వెనకాడలేదని నిర్మాత అన్నారు.

ఈ సినిమాలో యాక్షన్ మాత్రమే కాకుండా ఎమోషన్ కూడా ఉంటుందని తెలిపారు. థియేటర్లలో కన్నీళ్లను తుడుచుకునేందుకు హ్యాండ్ కర్చీఫ్‍లు రెడీగా ఉంచుకోవాలని నిర్మాత అంటున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!