HomeTelugu Big Storiesసమంతను ట్రోల్ చేస్తున్న నెటిజన్లు

సమంతను ట్రోల్ చేస్తున్న నెటిజన్లు

Samantha trolling by netize
స్టార్‌ హీరోయిన్‌, అక్కినేని కోడలు సమంత సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటుంది. ఎప్పటికప్పుడు తనకు సంబంధించిన విషయాలను, ఫొటోలను షేర్‌ చేస్తుంది. తాజాగా సమంత పెట్టిన ఓ ఫొటో వైరల్‌ గా మారింది. పోస్టు చేసిన కొద్దిసేపటికే ఆ పిక్‌ను తొలగించింది. సమంత. అప్పటికే ఆ ఫొటో వైరల్ గా మారిపోయింది. ఒక సోఫాలో పడుకున్న సమంత రిలాక్స్ అవుతున్నట్లుగా ఉంది. ప్రీతమ్ ఆమె కాళ్లను తనపై పెట్టుకున్నాడు. ఈ ఫొటోకు నాలుగేళ్లుగా కలిసి ఉన్నామన్న కామెంట్ తో పాటు ఒక లవ్ సింబల్ పెట్టారు. అదే ఫొటోను తన ఇన్ స్టా స్టోరీలో షేర్ చేసి ఐ లవ్యూ అని పెట్టారు. ఊహించని విధంగా ఉన్న ఫొటోను షేర్ చేయటంతో అక్కినేని ఫ్యాన్స్ షాక్‌ అయ్యారు. నెగెటివ్ గా రియాక్ట్‌ అవుతున్నారు. ఎంత చ‌నువు ఉంటే మాత్రం అలా ఆయ‌న మీద కాళ్ళు పెట్టి ఫొటో దిగ‌డం ఏంటి? ఐ ల‌వ్ యూ అని రిప్లై ఇవ్వ‌డ‌మేంట‌ని తెగ ట్రోల్ చేస్తున్నారు. దీంతో స‌మంత ఆ పోస్టుని వెంట‌నే తొల‌గించింది. ఆ వెంటనే ప్రీతమ్ కూడా తన స్టోరీలోనుంచి తీసేశారు. కానీ.. ఈ ఫోటో అప్పటికే వైరల్ గా మారింది.

Review – Freedom at Midnight – Written and narrated beautifully

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!