HomeTelugu Trendingనా కల ఈ రోజుతో నెరవేరింది: సమంత

నా కల ఈ రోజుతో నెరవేరింది: సమంత

Samantha Tweet on CharDum Y

నాగ చైతన్యతో విడాకుల అనంతరం సమంత బాగా కుంగిపోయిందని ఆమె సన్నిహితులు తెలిపారు. దీంతో ఆ బాధలోంచి బయటపడేందుకు ఇలా తీర్థయాత్రలకు వెళ్లినట్లు సమాచారం. విడాకుల ప్రకటనకు కొద్ది రోజుల ముందు కూడా సామ్‌ తిరుపతి, శ్రీకాశహస్తి దైవ దర్శనాలకు వెళ్లిన సంగతి తెలిసిందే.

ఇక య‌మునోత్రి నుంచి మొద‌లైన చార్‌ధామ్‌ యాత్ర గంగోత్రి మీదుగా కేదార్‌నాథ్‌, బ‌ద్రీనాథ్ వ‌ర‌కు సాగింది. అక్కడి ఎన్నో విశేషాలను తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేసింది. అక్కడ స్నేహితురాలు, ప్రముఖ డిజైనర్‌ శిల్పారెడ్డితో కలిసి సమంత ప్రత్యేక పూజలు నిర్వహించింది. అనంతరం గంగా ఆరతిలో పాలుపంచుకుంది. శనివారం ఇదే విషయాన్ని ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా అభిమానులతో పంచుకున్నారు. యాత్ర గురించి చెబుతూ ‘నా జీవితంలో హిమాలయాలకు ప్రత్యేక స్థానం ఉంది. మహాభారతం చదివినప్పటి నుంచి హిమాలయాల గురించి ఆకర్షితులరాలినయ్యాను. భూమి పై ఉన్న ఈ స్వర్గం, దేవుళ్ల నివాసం, గొప్ప రహస్యమే ఈ ప్రదేశం. ఎప్పటికైనా వీటిని చూడాలనే కల ఈ రోజుతో నెరవేరింది. అనుకున్నట్లు గానే దేవతల నిలయమైన ఈ అందమైన భూలోక స్వర్గాన్ని చూశాను. ఈ ట్రిప్‌ అంతా మరింత స్పెషల్‌గా నిలవడానికి కారణం నా స్నేహితురాలు, సోదరి శిల్పారెడ్డితో కలిసి చూడటం వల్లే’ అంటూ ఆనందాన్ని వ్యక్తం చేశారు.

రిషికేష్‌లోకి అడుగుపెట్టిన సామ్ అక్కడ సందర్శించిన ప్రఖ్యాత మహర్షి మహేష్‌ యోగి ఆశ్రమ విశేషాల గురించి చెబుతూ… ‘ ది బీటెల్స్‌'( ఇంగ్లిష్‌ రాక్‌ బ్యాండ్‌) నడిచిన చోట అడుగుపెట్టా. ఇక్కడే వారు ధ్యానం చేసేవారట. ఇక్కడే కూర్చొని ప్రసిద్ధి చెందిన పాటలు రాశారట. వీటన్నింటికీ నేను పెద్ద అభిమానిని.

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!