HomeTelugu Trending'నేను పర్‌ఫెక్ట్‌ కాదు'.. సమంత పోస్ట్‌ వైరల్‌

‘నేను పర్‌ఫెక్ట్‌ కాదు’.. సమంత పోస్ట్‌ వైరల్‌

Samantha says i am strong
స్టార్‌ హీరోయిన్‌ సమంత సోషల్‌ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటుందన్న సంగతి తెలిసిందే. నాగచైతన్యతో విడిపోయిన తర్వాత సమంత కెరీర్‌ విషయంలో దూకుడు పెంచింది. కొత్త ప్రాజెక్టులకు ఓకే చెబుతున్నారు. మరికొన్ని కథలూ వింటున్నారు. తాజాగా తన ఇన్‌స్టా స్టోరీస్‌లో ‘అమ్మ చెప్పింది’ అంటూ రాసుకొచ్చారు.

‘‘నేను శక్తిమంతురాలిని.. నేను దేనినైనా భరిస్తాను.. నేను పర్‌ఫెక్ట్‌ కాదు.. కానీ నాకు నేను పర్‌ఫెక్ట్‌.. నేను ఎప్పటికీ వెనకడుగు వేయను.. నేను ప్రేమ, దయ కలదాన్ని.. నేను దృఢ నిశ్చయం కలదాన్ని.. నేను తీవ్రమైనదాన్ని.. నేను మనిషిని.. నేను యోధురాలిని..’’ అని అమ్మచెప్పింది అంటూ సమంత పోస్ట్‌ చేశారు. ప్రస్తుతం ఈ పోస్టు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది.

సమంత నటించిన ‘శాకుంతలం’ ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకొంటోంది. ‘కాతువాకుల రెండు కాదల్‌’ విడుదలకు సిద్ధంగా ఉంది. వీటితో పాటు, ‘డ్రీమ్‌ వారియర్స్‌ పిక్చర్స్‌’, శ్రీదేవి మూవీస్‌ బ్యానర్‌లో రెండు సినిమాల చేసేందుకు ఒప్పుకొన్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!