పాప చనిపోవడంతో.. సమంత సెట్స్‌లోనే కన్నీరుమున్నీరయ్యారట

హీరోయిన్‌ సమంత ‘ప్రత్యూష సపోర్ట్‌’ ద్వారా ఎందరో చిన్నారులకు అండగా నిలుస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సంస్థను స్థాపించిన తొలిరోజుల్లో ఓ పసికందుకి సమంత కాలేయానికి శస్త్రచికిత్స చేయించారు. ఇందుకోసం సమంత, తన బృందంతో కలిసి రూ.15 లక్షలు సేకరించారు. కానీ దురదృష్టవశాత్తు ఆ పసికందు చికిత్సకు స్పందించక చనిపోయింది. ఈ విషయం తెలిసి సమంత సెట్స్‌లోనే కన్నీరుమున్నీరయ్యారట.

ఈ విషయాన్ని సంస్థలో వలంటీర్‌గా పనిచేస్తున్న శశాంకా బినేష్‌ అనే యువతి ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా వెల్లడించారు. ‘ప్రత్యూష సపోర్ట్‌ ద్వారా హ్యాండిల్‌ చేసిన తొలి కేసు ఇప్పటికీ గుర్తుంది. సనా అనే పసికందుకు కాలేయ మార్పిడి చేయించాం. ఇందుకోసం రూ.15 లక్షలు సేకరించాం. పాపకు శస్త్రచికిత్స చేయించడానికి తల్లిదండ్రులకు స్థోమత లేదు. వారిది ప్రేమ వివాహం కావడంతో ఇంట్లో వారు కూడా పట్టించుకోలేదు. సనాకు శస్త్రచికిత్స చేయించినప్పటికీ దురదృష్టవశాత్తు పాప చనిపోయింది. ఈ ఘటన జరిగినప్పుడు సమంత ‘రభస’ సినిమా సెట్‌లో చిత్రీకరణలో ఉన్నారు. ఈ విషయాన్ని నేను సమంతకు ఫోన్‌ చేసి చెప్పాను. అది విని సమంత చాలా బాధపడ్డారు. సెట్‌లోనే కన్నీరుమున్నీరయ్యారు. మరో విషయం ఏంటంటే..సనా చనిపోయిన రోజే సమంత పుట్టినరోజు. మాకు ఇప్పటికీ సనా చాలా ప్రత్యేకం. ఇప్పటివరకు ప్రత్యూష సపోర్ట్‌ ద్వారా 547 మంది చిన్నారులను కాపాడగలిగాం.

ఈ సంస్థ కోసం మేం విరాళాలు సేకరిస్తున్నామని చెప్పుకోవడానికి ఎంతో గర్విస్తున్నాం. ఆ విరాళాల్లో భారీ మొత్తం సమంత నుంచే వస్తోంది. ఆమె ప్రోత్సాహం, మద్దతు వల్లే మేం ప్రత్యూష సంస్థను ముందుకు నడిపిస్తున్నాం. మంచిపని కోసం సాయం చేయడానికి సమంత ఎప్పుడూ ముందుంటారు. కాకపోతే ఇప్పుడు వస్తున్న కేసులను మేం జాగ్రత్తగా ఎంపికచేసుకుంటున్నాం. ఈరోజుల్లో హైరిస్క్‌ క్యాన్సర్‌లు, ట్రాన్స్‌ప్లాంటేషన్స్‌ ఎక్కువగా ఉన్నాయి. దాంతో మా వద్దకు వచ్చే కేసులను మా సహ వ్యవస్థాపకురాలు మంజులా అనగాని బాగా పరిశీలించాకే మేం ఓకే చేస్తున్నాం. దాంతో ఒక్కోసారి కొందరు పిల్లల కేసులను ఒప్పుకోలేని పరిస్థితి ఎదురవుతోంది. కాబట్టి మాకు వచ్చే విరాళాలను జాగ్రత్తగా ఉపయోగించాలనుకుంటున్నాం. నేను ప్రత్యూషకు రాకముందు కొన్ని ఎన్జీవోలతో కలిసి పనిచేశాను. వారు సాయం పేరుతో సొమ్ముచేసుకునేవారు. అది చూసి షాకయ్యాను. ఇప్పుడు నేను మా కుటుంబం నడుపుతున్న ‘హ్యాపీ హోమ్స్‌’ అనాథాశ్రమానికి కూడా విరాళాలు సేకరిస్తున్నాను.’ అని వెల్లడించారు. ఈ పోస్ట్‌పై సమంత స్పందిస్తూ..’నిన్ను చూస్తే చాలా గర్వంగా ఉంది’ అంటూ శశాంకా పెట్టిన పోస్ట్‌ను తన ఇన్‌స్టాగ్రామ్‌లో రీపోస్ట్‌ చేశారు.

View this post on Instagram

So proud of you ❤️❤️❤️ ・・・ #Repost @officialhumansofhyderabad ・・・ “I still remember the first case we handled after #PratyushaSupport was formed. Baby Sana went through a liver transplantation, for which we had raised 15 lakh rupees. Her parents didn’t have any backing. It was a love marriage and their families didn’t support them. The baby passed away two days after the surgery. I remember breaking the news to Sam (#SamanthaAkkineni) while she was shooting for Rabhasa movie. It was Sam’s birthday and that was probably the most upset she has ever been. She broke down on the set. It was tough for all of us and we still consider Baby Sana the most special one. Since that day, we have saved 547 lives and counting. We’re so proud to say that all of them have been solely for welfare purposes with funds being raised from public and a major portion from Sam herself. It’s her encouragement and support that has kept us strong. When it’s a good deed, Sam always has a thumbs up and best wishes. But today, analyse the cases we take up. When there are things like high-risk cancers or transplantation, our co-founder Padmasree Dr. Manjula Anagani and her team do a thorough study before we accept the cases. And that’s also the most difficult part — to say no. Sometimes, there are really young children and it’s so painful to not be able to help them. But we’re dealing with public contributions, and we have to be wise and responsible about the usage of the funds. Also, I think that sets us apart from many other NGOs who make money in the name of welfare. I have worked with a couple of them and it’s appalling how they do it and have no sign of regret. We’re an all-women team and we’re proud of every work we do. All of us are here voluntarily and have gained much happiness all through.We do good work and we hope to bring a smile on every child’s face by giving them a happy life. I think the world needs more of this. Though this takes away a lot of my heart in a day, I try and do my bit for my family-run-orphanage, Happy Homes while managing my responsibilities at VHonk Digital Marketing

A post shared by Samantha Akkineni (@samantharuthprabhuoffl) on