‘నరకాసురుడు’గా యంగ్ హీరో!

narakasuruduడిఫరెంట్ కథలను ఎన్నుకుంటూ తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకోవాలని ప్రయత్నిస్తున్నాడు హీరో సందీప్ కిషన్. ఈ క్రమంలో దర్శకుడు కార్తీక్ నరేన్ రూపొందిస్తోన్న సినిమాలో నటించడానికి అంగీకరించాడు. గౌతమ్ మీనన్ ఈ సినిమాను నిర్మిస్తుండడం విశేషం. తెలుగు, తమిళ భాషల్లో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. తమిళంలో ఈ సినిమాకు ‘నరగసూరన్’ అనే టైటిల్ ను ఫైనల్ చేయగా.. తెలుగు వెర్షన్ కోసం ‘నరకాసురుడు’ అనే పేరుని ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. ఈ టైటిల్ లోగోను 

చిత్రబృందం విడుదల చేసింది.

ఈ సినిమాలో శ్రియాశరణ్ హీరోయిన్ గా కనిపించనుంది. అరవింద్ స్వామి, ఇంద్రజిత్ మరో ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. ఈ సినిమాలో సందీప్ కిషన్ పాత్రకు నెగెటివ్ షేడ్స్ కూడా ఉంటాయని సమాచారం. తెలుగులో ఈ మధ్య కాలంలో సందీప్ కు సరైన హిట్ సినిమా పడలేదు. తమిళంలో కూడా ఆయన సినిమాను అంతంతమాత్రంగానే ఆడుతున్నాయి. ఈ సినిమా అయినా.. సందీప్ కు కలిసొస్తుందేమో.. చూడాలి!