HomeTelugu Newsసప్తగిరి ఎక్స్ ప్రెస్ కు ప్రజా నీరాజనం!

సప్తగిరి ఎక్స్ ప్రెస్ కు ప్రజా నీరాజనం!

టాలీవుడ్ స్టార్ కమీడియన్ సప్తగిరి హీరో లాంఛింగ్ సినిమా సప్తగిరి ఎక్స్ ప్రెస్ బాక్సాఫీస్ పై కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. విడుదలైన ప్రతి చోటా హౌస్ ఫుల్ వసూళ్ల రాబడుతోందని ఈ చిత్ర బృందం తెలిపింది. మాస్టర్స్ హోమియోపతి అధినేత డాక్టర్ రవికిరణ్ శ్రీ సాయి సెల్యులాయిడ్ క్రియేషన్స్ పతాకం పై ఈ చిత్రాన్ని నిర్మించారు. ప్రేక్షకుల నుంచి ఈ చిత్రానికి వస్తోన్న ఆదరణ నేపథ్యంలో ఇటీవలే సప్తగిరి ఎక్స్ ప్రెస్ టీమ్ సక్సెస్ టూర్ ప్లాన్ చేశారు. అందులో భాగంగా మొదట శ్రీకాకుళం నుంచి నెల్లూరు వరకు ఈ చిత్ర బృందం పర్యటించింది. వెళ్లిన ప్రతి చోటా సప్తగిరి ఎక్స్ ప్రెస్ బృందాన్ని అభిమానులు విశేషంగా ఆదరించారని నిర్మాత రవికిరణ్ తెలిపారు.

త్వరలోనే నైజాం, సీడెడ్ ఏరియాల్లో కూడా పర్యటిస్తాం అని ఆయన చెప్పారు. ఇంతటి ఊహించని విజయాన్ని అందించిన తెలుగు ప్రేక్షకులకి మనస్పూర్తిగా కృతజ్ఞతలు తెలిపారు సప్తగిరి. సినిమాటోగ్రాఫ్ రామ్ ప్రసాద్, ఎడిటర్ గౌతంరాజు ఈ సినిమాను తమ నైపుణ్యంతో ప్రేక్షకుల్ని ఆద్యంతం అలరించే విధంగా తీర్చి దిద్దారని, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తమ చిత్ర బృందానికి ఎంతో సహాయపడ్డారని డైరెక్టర్ అరుణ్ చెప్పారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!