ఆ వార్తల్లో నిజం లేదట!

రజినీకాంత్, అక్షయ్ కుమార్ ప్రధాన పాత్రల్లో శంకర్ దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం ‘2.0’. ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకొని త్వరలోనే గుమ్మడికాయ ఫంక్షన్ కు రెడీ అవుతోంది. అయితే గత కొన్ని రోజులుగా ఈ సినిమాలో రజినీకాంత్ 5 గెటప్స్ లో, అక్షయ్ కుమార్ 12 గెటప్స్ లో కనిపించబోతున్నారని ప్రచారం జరిగింది. ప్రముఖ మీడియా పత్రికలు కూడా ఈ విషయాన్ని ప్రచురించారు. కానీ తాజాగా శంకర్ ఆ వార్తల్లో నిజం లేదని తేల్చేశారు.

ఇది ఇలా ఉండగా తమిళ మీడియా శంకర్ కు వ్యతిరేకంగా మారింది. ఓ జర్నలిస్ట్ పై రోబో టీం ఇటీవల దాడి చేసిన సంగతి తెలిసిందే. దీంతో 2.0 సినిమాకు మీడియాలో బజ్ తగ్గింది. శంకర్ స్వయంగా అప్ డేట్స్ ఇచ్చినా ప్రచురించని పరిస్థితి ఎదురైంది. దీంతో త్వరలోనే ఓ ప్రెస్ మీట్ పెట్టి జర్నలిస్ట్ లను బుజ్జగించే ప్రయత్నం చేయబోతున్నాడు.