HomeTelugu Newsశర్వానంద్ కోసం 'రాధ'!

శర్వానంద్ కోసం ‘రాధ’!

వరుస విజయాలతో దూసుకుపోతోన్న యువ స్టార్ హీరో శర్వానంద్, తన తదుపరి  సినిమాని  సూపర్  హిట్ చిత్రాలను నిర్మించిన శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్ లో చేస్తోన్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి ‘రాధ’ అనే టైటిల్ ను ఖరారు చేస్తూ, శివరాత్రి సందర్భం గా ఫస్ట్ లుక్ ను విడుదల చేశారు.  
విన్నూత్నమైన కథలతో, మంచి నటనతో తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ను సంపాదించుకున్న  శర్వానంద్, ఇంతకుముందు ఎన్నడూ చేయని ఒక వినోదభరితమైన పోలీస్ పాత్రలో ఈ చిత్రంలో కనిపిస్తారు. ఒక్క పాట మినహా ఈ చిత్రం షూటింగ్ పూర్తి అయ్యింది. వేసవి సెలవుల్లో, ఉగాది (మార్చి 29) రోజున ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు చిత్ర బృందం సన్నాహాలు చేస్తోంది. శర్వ సరసన లావణ్యా త్రిపాఠి హీరోయిన్ గా కనిపించే ఈ చిత్రానికి నూతన దర్శకుడు చంద్రమోహన్ పని చేస్తున్నారు. ఈ సందర్భంగా.. 
సమర్పకులు బి వి ఎస్ ఎన్ ప్రసాద్ మాట్లాడుతూ.. ” పూర్తి వినోదాత్మకం గా ఈ చిత్రం ఉంటుంది. నూతన దర్శకుడు చంద్రమోహన్ చెప్పిన కథ బాగుంది. రొమాన్స్, కామెడీ , యాక్షన్ సమపాళ్ళలో ఉండే మా సినిమా అటు క్లాస్ ప్రేక్షకులను, ఇటు మాస్ ప్రేక్షకులను అలరిస్తుంది. ఈ సినిమాకి రాధ అనే టైటిల్ చక్కగా సరిపోతుంది. ఉగాది రోజున చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నాం” అని అన్నారు. 
 

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!