HomeTelugu Trendingప్రముఖ గాయకుడి డైమెండ్‌ నెక్లెస్‌ మాయం

ప్రముఖ గాయకుడి డైమెండ్‌ నెక్లెస్‌ మాయం

Singer Hariharan diamond ne
ప్రముఖ గాయకుడు హరిహరన్‌కు చేదు అనుభవం ఎదురైంది. రాజస్థాన్ పర్యటనను ముగించుకుని ముంబై తిరిగి వెళ్లేందుకు జైపూర్ ఎయిర్ పోర్టుకు చేరుకున్నారు. అయితే, ఎయిర్ పోర్టులో ఆయన మెడలో ఉన్న డైమండ్ నెక్లెస్ మాయమైంది. ఎయిర్ పోర్టులో సెక్యూరిటీ చెకింగ్ సమయంలో తన మెడలోని నెక్లెస్ మాయమైనట్టు ఆయన గుర్తించారు. వెంటనే అక్కడ ఆయన వెతికినప్పటికీ అది దొరకలేదు. దీంతో తన మేనేజర్ చేతన్ గుప్తాతో కలిసి జవహర్ సర్కిల్ పోలీస్ స్టేషన్ లో ఆయన ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు సీసీ కెమెరా ఫుటేజీని పరిశీలిస్తున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!