మిల్కీ బ్యూటీని బీట్‌ చేసిన మహేష్ కూతురు.. వీడియో వైరల్


టాలీవుడ్‌ సూపర్‌స్టార్‌ మహేశ్‌ బాబు నటించిన తాజా చిత్రం ‘సరిలేరునీకెవ్వరు’. అనిల్‌ రావిపూడి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో మహేశ్‌ ఆర్మీ ఆఫీసర్‌గా కనిపించారు. ఈ సినిమాలో మిల్కీబ్యూటీ తమన్నా ‘డాంగ్‌ డాంగ్‌’ అనే పార్టీ సాంగ్‌కు తనదైన శైలిలో డ్యాన్స్‌ చేసి ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్న విషయం తెలిసిందే. అయితే తాజాగా ‘డాంగ్‌ డాంగ్‌’ పాటకు మహేశ్‌ కుమార్తె సితార అదరగొట్టేలా స్టెప్పులు వేసింది. దీనికి సంబంధించిన వీడియోను నమ్రత ఇన్‌స్టా వేదికగా షేర్‌ చేసింది. మరోవైపు సితార డ్యాన్స్‌ చూసిన నెటిజన్లు.. ‘సితార డ్యాన్స్‌తో అదరగొట్టేశారు’, ‘మిల్కీ బ్యూటీని బీట్‌ చేసేశారు’ అంటూ కామెంట్లు పెడుతున్నారు. ఇప్పడు ఈ వీడియో వైరల్‌గా మారింది.

https://www.instagram.com/tv/B8gkH6fDHT0/?utm_source=ig_web_copy_link