శంకర్‌ డైరెక్ట్‌ చేయబోతున్న తొలి తెలుగు హీరో?


‘బాహుబలి’ సినిమా తర్వాత ప్రపంచ వ్యాప్తంగా క్రేజ్ సంపాదించుకున్న హీరో ప్రభాస్‌తో సినిమాలు చేయడానికి దర్శక, నిర్మాతలు క్యూ కడుతున్నారు. ప్రస్తుతం జిల్ ఫేం రాధాకృష్ణ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతోంది. దీని తర్వాత సినిమా ఏమిటనే దానిపై అభిమానుల్లో ఓ వార్త షికార్లు చేస్తోంది. విభిన్న చిత్రాల దర్శకుడు రోబో, 2.0 లాంటి బ్లాక్ బస్టర్ చిత్రాలను తెరకెక్కించిన శంకర్‌.. ప్రభాస్‌తో కలిసి ఓ సినిమా రూపొందించేందుకు సన్నాహాలు చేస్తున్నారట. భారీ బడ్జెట్ సినిమాలను తెరకెక్కించడంలో దర్శకుడు శంకర్ స్పెషలిస్టు అని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.

యంగ్‌ రెబల్ స్టార్ ప్రభాస్‌కు బాలీవుడ్‌లోనూ మంచి మార్కెట్‌ ఉంది. భారీ బడ్జెట్‌తో పాటు తన మార్క్‌ మెసేజ్‌ ఓరియెంటెడ్‌ చిత్రాన్ని తీయాలని శంకర్‌ భావిస్తున్నట్లు.. ఇప్పటికే ప్రభాస్‌ను దృష్టిలో పెట్టుకొని స్క్రిప్ట్‌ను కూడా సిద్దం చేసినట్లు సమాచారం. అయితే ఈ చిత్రాన్ని హాలీవుడ్‌ రేంజ్‌లో ప్లాన్‌ చేస్తున్నాడని తెలుస్తోంది. గతంలో పలుమార్లు తెలుగు హీరోలతో సినిమా తీయాలని శంకర్‌ భావించినప్పటికీ సరైన కాంబినేషన్‌ కుదరలేదు. శంకర్‌ డైరెక్ట్‌ చేయబోతున్న తొలి తెలుగు హీరోగా ప్రభాస్‌ నిలవనున్నాడు. కమల్‌హాసన్‌తో ‘భారతీయుడు 2’ చిత్రంతో బిజీగా ఉన్న శంకర్‌.. ఈ మూవీ తర్వాతనే ఆ ప్రాజెక్ట్‌ను పట్టాలెక్కించాలని భావిస్తున్నాడట.

CLICK HERE!! For the aha Latest Updates