HomeTelugu Trendingప్రాణహాని వుందంటూ.. పోలీసులకు శ్రీరెడ్డి ఫిర్యాదు

ప్రాణహాని వుందంటూ.. పోలీసులకు శ్రీరెడ్డి ఫిర్యాదు

1 26
సంచలన నటి శ్రీరెడ్డి తనపై హత్యాయత్నానికి పాల్పడుతున్నారని బుధవారం చెన్నై పోలీస్‌కమిషనర్‌ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. ఆ వివరాల్లోకి వెళితే… అసభ్యకర పోస్ట్‌లు పెట్టారంటూ శ్రీరెడ్డిపై నటి కరాటే కల్యాణి, డాన్స్‌ మాస్టర్‌ రాకేశ్‌ మాస్టర్‌పై తెలంగాణా రాష్ట్ర క్రైమ్‌బ్రాంచ్‌ పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. అందులో శ్రీరెడ్డి తమ గురించి అసభ్యకరమైన సామాజిక మాధ్యమాల్లో పోస్ట్‌ చేసినట్లు ఫిర్యాదు చేశారు. దీంతో క్రైమ్‌బ్రాంచ్‌ పోలీసులు శ్రీరెడ్డిపై కేసు నమోదు చేశారు

ఈ నేపథ్యంలో శ్రీరెడ్డి… నటి కరాటే కల్యాణి, నృత్య దర్శకుడు రాకేశ్‌ మాస్టర్‌పై చెన్నై పోలీస్‌ కమిషనర్‌ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. తన ఫిర్యాదులో వారిద్దరూ తనపై హత్యా బెదిరింపులకు పాల్పడుతున్నట్లు పేర్కొన్నారు. అనంతరం శ్రీరెడ్డి మీడియాతో మాట్లాడుతూ… తానిప్పుడు రెండు చిత్రాల్లో నటిస్తున్నానని, తనను తమిళ ప్రేక్షకులు ఆదరిస్తున్నట్లు తెలిపారు. అయితే కరాటే కల్యాణి, రాకేశ్‌ మాస్టర్‌ తన గురించి సామాజిక మాధ్యమాల్లో తప్పుడు ప్రచారం చేస్తున్నారని అన్నారు. తాను చెన్నైలో కారు, ఇల్లు కొనుక్కున్నానని, దీని గురించి వారు తప్పుడు ప్రచారం చేస్తున్నారని, అసభ్యంగా సామాజిక మాధ్యమాల్లో పోస్టులు చేస్తున్నట్లు చెప్పారు. తనను పెట్రోల్‌ పోసి తగల పెడతామని హత్యా బెదిరింపులకు పాల్పడుతున్నారని, అందుకే ఫిర్యాదు చేసినట్లు శ్రీరెడ్డి తెలిపారు

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!