HomeTelugu Newsహాజీపూర్ హత్యల కేసులో.. కోర్టు తీర్పు .. శ్రీనివాస్‌రెడ్డే దోషి..

హాజీపూర్ హత్యల కేసులో.. కోర్టు తీర్పు .. శ్రీనివాస్‌రెడ్డే దోషి..

6 5
రాష్ట్రంలో సంచలనం సృష్టించిన హాజీపూర్ హత్యల కేసులో తుది తీర్పు వెల్లడైంది. నిందితుడు మర్రి శ్రీనివాస్‌రెడ్డిని దోషిగా తేలుస్తూ నల్గొండలోని పోక్సో న్యాయస్థానం తీర్పు వెలువరించింది. భోజన విరామం అనంతరం కిక్కిరిసిన కోర్టు హాలులో పోలీసులు నిందితుడిని ప్రవేశపెట్టగా న్యాయమూర్తి తీర్పు వెల్లడించారు. యాదాద్రి జిల్లా బొమ్మలరామారం మండలం హాజీపూర్‌లో 20 ఏళ్లు కూడా నిండని ముగ్గురు అమ్మాయిలను అదే గ్రామానికి చెందిన శ్రీనివాస్‌రెడ్డి కిడ్నాప్‌, అత్యాచారం, హత్య చేయడంపై గతేడాది ఏప్రిల్‌లో మూడు కేసులు నమోదయ్యాయి. అంతకుముందే కర్నూలు జిల్లాలో అతడిపై మరో హత్యకేసు నమోదైంది. బాధితులంతా మైనర్లు కావడంతో నిందితుడిపై చిన్న పిల్లలపై లైంగిక వేధింపుల నిరోధక చట్టం (పోక్సో) కింద పోలీసులు కేసు నమోదు చేశారు. దాదాపు మూడు నెలల పాటు బాధితుల తల్లిదండ్రులు, బంధువులు, ప్రత్యక్ష సాక్షులు, ఫొరెన్సిక్‌ నిపుణులు, పోలీసులు, పంచనామా చేసినవారు.. ఇలా మొత్తం 101 మంది సాక్షులను పోక్సో కోర్టు విచారించింది.

భోజన విరామానికి ముందు శ్రీనివాస్‌రెడ్డిని న్యాయమూర్తి పలు ప్రశ్నలు అడిగారు. ముగ్గురు మైనర్లపై హత్యాచార కేసులో నేరం నిరూపితమైందని, ఏమైనా చెప్పుకునేది ఉందా? అని న్యాయమూర్తి ప్రశ్నించారు. తనకు కేసులతో ఎలాంటి సంబంధం లేదని ఆయన చెప్పాడు. తనపై కోపంతో ఊర్లో ఉన్న ఇల్లు తగలబెట్టారని.. భూములు లాక్కున్నారని, తన తల్లిదండ్రులకు దిక్కు లేకుండా పోయిందని శ్రీనివాస్‌రెడ్డి న్యాయమూర్తికి తెలిపాడు. శిక్ష గురించి మరేమైనా చెప్పుకుంటావా? అని న్యాయమూర్తి మరోసారి అడిగినా.. నిందితుడు మళ్లీ అదే సమాధానమిచ్చాడు. భోజన విరామం అనంతరం న్యాయమూర్తి తీర్పును వెలువరించి శ్రీనివాసరెడ్డిని దోషిగా తేల్చారు. ఇటీవల ‘సమత’ కేసులో నిందితులకు ఉరిశిక్ష విధించిన నేపథ్యంలో ఈ కేసులో దోషిగా తేలిన శ్రీనివాస్‌రెడ్డికి ఎలాంటి శిక్ష పడనుందనే ఉత్కంఠ నెలకొంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu