HomeTelugu Trendingతండ్రికి హెయిర్‌ కట్‌ చేసిన హీరో సందీప్‌ కిషన్‌..

తండ్రికి హెయిర్‌ కట్‌ చేసిన హీరో సందీప్‌ కిషన్‌..

2 16టాలీవుడ్‌ యంగ్ హీరో సందీప్ కిషన్.. చివరగా ‘తెనాలి రామకృష్ణ’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం లాక్ డౌన్ కగణంగా సినిమా షూటింగ్స్ లేక ఇంటికే పరిమితమయ్యాడు సందీప్ కిషన్. సోషల్ మీడియా ద్వారా అభిమానులకు అందుబాటులోఉండే సందీప్ తాజాగా ఓ వీడియో ను అభిమానులతో పంచుకున్నాడు. తన తండ్రికి సోదరితో కలిసి హెయిర్ కట్ చేశాడు. స్టైలిష్ లుక్ లోకి తండ్రిని మార్చి అది వీడియో తీసి ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేశాడు. ఈ లాక్‌డౌన్ సమయంలో కుటుంబ సభ్యులతో కలిసి చాలా సరదాగా సందీప్ కిషన్ గడుపుతున్నాడు. లాక్‌డౌన్ తరవాత సందీప్‌ నటిస్తున్న ‘ఎ1 ఎక్స్ ప్రెస్’ చిత్రం షూటింగ్‌ పూర్తి చేయాలని చూస్తున్నాడు. తాజాగా సందీప్ కిషన్ పోస్ట్ చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!