ఆస్కార్ విన్నర్‌ తో సూర్య సినిమా

ఆస్కార్ విన్నర్‌ అయిన ద‌ర్శ‌కురాలితో ఇప్పుడు హీరో సూర్య సినిమా చేయ‌బోతున్నాడు. ప్ర‌స్తుతం ఈయ‌న వ‌ర‌స సినిమాలతో బీజీగా ఉన్నాడు. ఎన్జికే సినిమాతో పాటు కేవీ ఆనంద్, హ‌రి లాంటి ద‌ర్శ‌కుల‌తో కూడా సినిమాలు చేస్తున్నాడు సూర్య‌. ఇదిలా ఉంటే ఇప్పుడు మ‌రో సినిమాకు కూడా ఓకే చెప్పాడు ఈ హీరో. అది కూడా ఆస్కార్ విన్న‌ర్ డైరెక్ట‌ర్‌తో కొత్త సినిమా చేయ‌బోతున్నాడు సూర్య‌.

త‌న సొంత నిర్మాణ సంస్థ 2డి ఎంట‌ర్ టైన్మెంట్స్ ఈ చిత్రాన్ని నిర్మించ‌నుంది. మొన్న జ‌రిగిన 91వ ఆస్కార్ వేడుకలో ఇండియా నుంచి ప్రముఖ దర్శకురాలు గునీత్ మోంగా ‘పీరియడ్‌: ఎండ్‌ ఆఫ్‌ ఎ సెంటెన్స్‌’ అనే డాక్యుమెంటరీ సినిమా చేసినందుకు గానూ ఆస్కార్ అవార్డ్ అందుకుంది. ఇక ఇప్పుడు ఈమె త‌మిళ‌నాట ఓ సినిమా చేయ‌బోతుంది. సూర్య కోసం అద్భుత‌మైన క‌థ సిద్ధం చేసిన మోంగా.. ఆయ‌న‌కు చెప్పి ఒప్పించింది. త్వ‌ర‌లోనే ఈ చిత్రం ప‌ట్టాలెక్క‌నుంది కూడా.

సూర్యతో కలిసి పనిచేయబోతున్నందుకు త‌న‌కు చాలా ఆనందంగా ఉందంటూ ట్వీట్ చేసింది గునీత్. ఈ ఆఫ‌ర్ త‌న‌కు ఇచ్చినందుకు సూర్య‌కు ధ‌న్య‌వాదాలు తెలిపింది. త్వరలోనే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్ల‌నుంది. ఇందులో క్యాస్టింగ్ అండ్ క్ర్యూ వివ‌రాలు త్వ‌ర‌లోనే బ‌య‌టికి రానున్నాయి. మొత్తానికి ఆస్కార్ విన్న‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో సూర్య ఎలాంటి సినిమా చేయ‌బోతున్నాడో చూడాలిక‌.