సింగం డైరెక్టర్ తో మరోసారి సూర్య!

స్టార్ హీరో సూర్యకు తమిళంలో ఎంత క్రేజ్ ఉందో.. తెలుగులో కూడా అంతే క్రేజ్ ఉంది. ఆయన అనువాద చిత్రాలను కూడా స్ట్రెయిట్ చిత్రాలు మాదిరి ఇక్కడ అభిమానులు ఆదరిస్తూ ఉంటారు. ప్రస్తుతం ఆయన విఘ్నేష్ శివన్ దర్శకత్వంలో ఓ సినిమా అలానే సెల్వ రాఘవన్ దర్శకత్వంలో మరో సినిమా చేయడానికి ప్లాన్ చేస్తున్నాడు. అయితే తనకు సింగం సిరీస్ తో వరుస హిట్ ఇచ్చిన దర్శకుడు హరితో కలిసి మరోసారి పని చేయడానికి ఆసక్తి చూపుతున్నాడు సూర్య.

నిజానికి సింగం సిరీస్ లో భాగంగా వచ్చిన మూడు సినిమాల తరువాత నాలుగో సినిమా చేయడానికి సమయం పడుతుందని సూర్య, హరి లు కమిట్ అయిన ప్రాజెక్ట్ ను పూర్తి చేసిన తరువాత ఓ నాలుగేళ్ల గ్యాప్ తరువాత సింగం4 ఉంటే ఉండొచ్చని అన్నారు. అయితే తాజాగా వీరిద్దరు కలిసి పని చేయడానికి రెడీ అవ్వడంతో ఇది కొత్త కథ అయి ఉండొచ్చని అంటున్నారు. ప్రస్తుతం హరి డైరెక్ట్ చేస్తోన్న ‘సామి2’ చిత్రం పూర్తయిన వెంటనే ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కుతుందని చెబుతున్నారు.