HomeTelugu Trendingరియా కాల్ లిస్ట్ లో టాలీవుడ్‌ స్టార్స్‌..

రియా కాల్ లిస్ట్ లో టాలీవుడ్‌ స్టార్స్‌..

Rhea phone call to Rana dag
బాలీవుడ్‌ యంగ్‌ హీరో సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ ఆత్మహత్య కేసులో ఆయన మాజీ ప్రియురాలు రియా చక్రవర్తి కాల్‌ డేటాను పోలీసులు పరిశీలిస్తున్న సంగతి తెలిసిందే. అయితే కాల్‌ లిస్ట్‌కు సంబంధించి ఇప్పుడు ఆసక్తికరమైన విషయాలు బయటకు వస్తున్నాయి. ఇండస్ట్రీలోని చాలా మంది సెలబ్రిటీలతో రియా చక్రవర్తి టచ్ లో ఉన్నట్లు వెల్లడించారు. ఈ వార్తలపై నిజం ఎంత ఉందో తెలియదు కానీ రియా కాల్ లిస్ట్ లో మన టాలీవుడ్ సెలబ్రిటీలతో కూడా ఆమె మాట్లాడినట్లు తెలుస్తోంది. రియా కాల్ లిస్ట్ లో టాలీవుడ్ హీరో కూడా ఉన్నాడు. హీరో దగ్గుబాటి రానా తో రియా మాట్లాడినట్టు తెలుస్తుంది. రానాకి రియా 7 సార్లు కాల్ చేయగా.. రానా 4 సార్లు ఆమెకు కాల్ చేసినట్లు వెల్లడించింది. అలాగే హీరోయిన్‌ రకుల్ ప్రీత్ తో కూడా రియా మాట్లాడింది. రియా సీడీఆర్ లిస్ట్ ప్రకారం రకుల్ కు ఆమె 30 సార్లు కాల్ చేయగా.. రకుల్ ఆమెకు 14 సార్లు కాల్‌ చేసినట్లు వెల్లడించింది. వీరి మధ్య టెక్స్ట్ మెసేజ్ సంభాషణ కూడా జరిగినట్లు తెలుస్తోంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!