HomeTelugu Trendingగని సినిమాలో తమన్నా ఐటం సాంగ్‌!

గని సినిమాలో తమన్నా ఐటం సాంగ్‌!

Tamanna item song in Ghani

మిల్కీ బ్యూటీ తమన్నా పలు సినిమాల్లో నటించడంతో పాటు మెగా హీరో వరుణ్ తేజ్ సినిమా గని లో ఐటెం సాంగ్ ను చేయబోతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. అందుకు సంబంధించిన షూటింగ్ కార్యక్రమాలు కూడా ఇటీవల జరిగాయని మీడియా వర్గాల ద్వారా సమాచారం అందుతోంది. వరుణ్ తేజ్ హీరోగా కిరణ్ కొర్రపాటి దర్శకత్వంలో ‘గని’ సినిమా షూటింగ్ స్పాట్ లో తమన్నా కనిపించడంతో ఆమె ఐటెం సాంగ్ ను చేస్తుందనే వార్తలు వస్తున్నాయి. గతంలో కేజీఎఫ్ మరియు సరిలేరు నీకెవ్వరు సినిమాతో పాటు మరికొన్ని సినిమాల్లో కూడా ఐటెం సాంగ్ లను ప్రత్యేక పాత్రలను చేసిన తమన్నా మరోసారి గని సినిమాతో ఐటెం సాంగ్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

ఒక వైపు ఎఫ్ 3 సినిమాలో హీరోయిన్ గా నటిస్తూ.. మాస్టర్ చెఫ్ టీవీ షో కు హోస్టింగ్ చేస్తున్న తమన్నా అదే క్రమంలో గని సినిమాలో ఐటెం సాంగ్ ను కూడా చేస్తోంది. బిజీ బిజీగా తమన్నా కెరీర్ సాగుతూ ఉంది. ఇండస్ట్రీలో అడుగు పెట్టి చాలా ఏళ్లు అయినా కూడా ఆమె క్రేజ్ మాత్రం తగ్గలేదు. గని సినిమాలో ఐటెం సాంగ్ చేసినందుకు గాను భారీగానే డిమెండ్‌ చేసిన్నట్లు తెలుస్తోంది. గని సినిమాలో వరుణ్ తేజ్ బాక్సర్ గా కనిపించబోతున్నాడు. ఈ సినిమా తో అల్లు అరవింద్ పెద్దబ్బాయి అల్లు బాబీ నిర్మాతగా మారబోతున్నాడు. సిద్దుతో కలిసి ఆయన ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!