మోడీ బయోపిక్‌పై కాజల్‌ ట్వీట్‌.. నెటిజన్ల అగ్రహం

స్టార్‌ హీరోయిన్‌ కాజల్ అగర్వాల్‌కు సోషల్ మీడియాలో భారీ ఫాలోయింగ్ ఉంది. ఆమె ఒక పోస్ట్ పెట్టింది అంటే… దానికి లక్షల సంఖ్యలో లైక్ లు షేర్స్ వస్తుంటాయి. అందుకే చాలా కంపెనీలు సెలెబ్రిటీలతో సోషల్ మీడియాలో ప్రచారం చేయించుకోవాలని చూస్తుంటారు.

ఇదిలా ఉంటె, కొంతమంది సెలెబ్రిటీలు కొన్ని విషయాల గురించి మాట్లాడే సమయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకుంటుంటారు. ఏదైనా పొరపాటుగా మాట్లాడారా ఇక అంతే…ఇబ్బందులు పడాల్సిందే. రీసెంట్ గా కాజల్ అగర్వాల్ కూడా ఇలాంటి చిక్కుల్లోనే ఇరుక్కుంది.

పిఎం నరేంద్ర మోడీ సినిమా పోస్టర్ పై స్పందిస్తూ.. సినిమా చాలా బాగుంటుందని నమ్ముతున్నాను.. సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను అని చెప్పి ట్వీట్ చేసింది. ఈ ట్వీట్ పై ఇప్పుడు పెద్ద దుమారం రేగుతున్నది. ముఖ్యంగా తమిళనాడులో. తమిళనాడులో కొంతమంది దీనిని చాలా సీరియస్ గా తీసుకున్నారు. మోడీకి కాజల్ సపోర్ట్ చేస్తున్నదని, ఆమె సినిమాలో తమిళనాడులో బ్యాన్ చేయాలనీ చెప్పి డిమాండ్ చేస్తున్నారు. ప్రచారంలో భాగంగానో లేదంటే, రాజకీయాల్లోకి రావాలనే ఉద్దేశ్యంతోను కాజల్ ఇలా మాట్లాడిందని మండిపడుతున్నారు. మరి ఈ వ్యాఖ్యలపై కాజల్ ఎలా స్పందిస్తుందో చూడాలి.