HomeTelugu Trendingసమంతలో అదే ఇష్టం అంటున్న త్రివిక్రమ్‌

సమంతలో అదే ఇష్టం అంటున్న త్రివిక్రమ్‌

1 25

డైరెక్టర్‌ త్రివిక్రమ్ తాజాగా ‘అల వైకుంఠపురంలో’ సినిమాతో సాలిడ్ హిట్ అందుకున్నాడు. కాగా ప్రస్తుతం త్రివిక్రమ్ ఎన్టీఆర్ తో సినిమా చేస్తున్నారు. ఈ సినిమాను ఆ మధ్య అఫీషియల్ గా ప్రకటించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఎన్టీఆర్ రాజమౌళి తెరకెక్కిస్తున్న ‘ఆర్ఆర్ఆర్’ సినిమాలో బీజీగా ఉన్నాడు. ఈ సినిమా తరవాత త్రివిక్రమ్‌ తో చేయనున్నట్లు తెలుస్తుంది. ఈ సినిమాకు ‘అయినాను పోయిరావలె హస్తినకు’ అనే టైటిల్ ను పరిశీలిస్తున్నారు.

కాగా ఈ సినిమాలో హీరోయిన్ విషయంలో రకరకాల వార్తలు వస్తున్నాయి. ఈ సినిమాలో పూజాహెగ్డే హీరోయిన్ గా తీసుకుంటున్నారని వార్తలు వచ్చాయి. పూజతో త్రివిక్రమ్ అరవింద సమేత, ‘అల వైకుంఠపురంలో’ సినిమాలు చేశారు. ఇక పూజ అటు హిందీలోనూ బిజీగా ఉండటంతో రష్మిక ను ఏమికా చేసే ఆలోచనలో ఉన్నారని వార్తలు వచ్చాయి. తాజాగా సమంత పేరు కూడా వినిపిస్తుంది. సమంత తో గతంలో అత్తారింటికి దారేది, సన్నాఫ్ సత్యమూర్తి, అఆ సినిమాలు చేశారు త్రివిక్రమ్. కాగా సమంత చిలిపితనమంటే తనకు ఇష్టమని గతంలో కూడా చెప్పారు త్రివిక్రమ్ ఆయన రాసే మాటలకూ సమంత చిలిపితనం సరిగ్గా సూటవుతుందని గత చిత్రాలతో నిరూపించారు. ఇక ఈ సినిమాలో కూడా ఆమెనే తీసుకోవాలని భావిస్తున్నాడట త్రివిక్రమ్‌.

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!