మహేష్ కోసం లొకేషన్స్ వేట!

సూపర్ స్టార్ మహేష్ బాబు చాలా కాలంగా ‘స్పైడర్’ సినిమా షూటింగ్ లోనే ఉండిపోయారు. సినిమాల విషయంలో చాలా గ్యాప్ తీసుకునే మహేష్ ఇప్పుడు వరుస సినిమాలను లైన్ లో పెట్టాడు. స్పైడర్ సినిమా షూటింగ్ ముగించుకున్న మహేష్.. కొరటాల శివ దర్శకత్వంలో ‘భరత్ అను నేను’ సినిమా షూటింగ్ లో పాల్గొంటున్నాడు. ఈ సినిమాలో మహేష్ ముఖ్యమంత్రి పాత్రలో కనిపించనున్నాడు.

ఈ సినిమా ద్వారా బాలీవుడ్ హీరోయిన్ కైరా అద్వానీ తెలుగు వారికి పరిచయం కానుంది. ఈ సినిమా తరువాత మహేష్.. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో సినిమా చేయడానికి అంగీకరించాడు. ఈ సినిమాకు ఇంకా టైటిల్ కన్ఫర్మ్ కాలేదు. అయితే కథను బట్టి సినిమా షూటింగ్ అమెరికాలో జరపనున్నారు. దీనికోసం డైరెక్టర్ ఇప్పటికే లొకేషన్స్ ను వెతికే పనిలో పడ్డారు. వచ్చే ఏడాది ఆరంభంలో ఈ సినిమా షూటింగ్ మొదలు కానుంది. ఈ సినిమాలో డిజె భామ పూజా హెగ్డేను హీరోయిన్ గా తీసుకున్నారని సమాచారం.