‘వంగవీటి’ విడుదలకు సిద్ధం!

సెన్సేష‌న‌ల్ డైరెక్ట‌ర్ రామ్‌గోపాల్ వ‌ర్మ ద్శ‌క‌త్వంలో రూపొందిన చిత్రం ‘వంగ‌వీటి’. దాసరి కిర‌ణ్‌కుమార్ నిర్మాత‌గా రామ‌దూత క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌లో రూపొందిన ఈ సెన్సేష‌న‌ల్ మూవీ ‘వంగ‌వీటి’ చిత్రాన్ని డిసెంబ‌ర్ 23న ప్ర‌పంచ వ్యాప్తంగా అభిషేక్ పిక్చ‌ర్స్ సంస్థ విడుద‌ల చేస్తుంది. రీసెంట్‌గా విడుద‌లైన పాట‌ల‌కు, థియేట్రిక‌ల్ ట్రైల‌ర్‌కు ఆడియెన్స్ నుండి సూప‌ర్బ్ రెస్పాన్స్ వ‌చ్చింది.

ఎన్నో బ్లాక్ బ‌స్ట‌ర్ చిత్రాల‌ను తెలుగులో విడుద‌ల చేసిన అభిషేక్ పిక్చ‌ర్స్ ఫ్యాన్సీ రేటు చెల్లించి నైజాం హ‌క్కుల‌ను సొంతం చేసుకున్నారు. సినిమా అనౌన్స్ చేసిన‌ప్ప‌టి నుండి ఎంతో క్రేజ్ నెల‌కొన్నఈ సినిమాను అభిషేక్ పిక్చ‌ర్స్ వారు ఎంతో ప్రెస్టీజియ‌స్‌గా అత్య‌ధిక థియేట‌ర్స్‌లో విడుద‌ల చేస్తున్నారు. డిసెంబ‌ర్ 20న ‘వంగ‌వీటి’ సినిమాకు సంబంధించిన వేడుక హైదరాబాద్‌లో గ్రాండ్‌గా జ‌ర‌గ‌నుంది. ఈ వేడుక‌కు బాలీవుడ్ సూప‌ర్‌స్టార్, బిగ్ బి అమితాబ్ బ‌చ్చ‌న్‌, కింగ్ నాగార్జున‌లు ముఖ్య అతిథులుగా విచ్చేస్తున్నారు.