అద్భుతంగా ‘వాల్మీకి’ ప్రీటీజర్‌

మెగా హీరో వరుణ్‌తేజ్‌ హరీశ్‌ శంకర్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న మూవీ ‘వాల్మీకి’. ఈ చిత్రంలో పూజాహెగ్డే హీరోయిన్‌గా నటిస్తున్నారు. సోమవారం ఈ సినిమాకు సంబంధించిన ప్రీ టీజర్‌ను చిత్ర బృందం అభిమానులతో పంచుకుంది. డైలాగ్‌లేమీ లేకుండా వచ్చిన ఈ టీజర్‌లో వరుణ్‌తేజ్‌ గడ్డం, చేతిలో తుపాకీ, కంటికి సుర్మా పెట్టుకుని, మాస్‌ లుక్‌లో కనిపించారు. శరవేగంగా చిత్రీకరణ జరుపుకొంటున్న ‘వాల్మీకి’ చిత్రానికి మిక్కీ జే మేయర్‌ సంగీతం అందిస్తున్నారు. 14రీల్స్‌ ప్లస్‌ పతాకంపై రామ్‌ ఆచంట, గోపి ఆచంటలు నిర్మిస్తున్నారు.

ఈ సందర్భంగా వరుణ్‌తేజ్‌ ప్రీటీజర్‌ను పంచుకుంటూ ‘మీరెప్పుడూ చూడని లుక్‌లో నేను. మీకు నచ్చుతుందని అనుకుంటున్నా’ అని ట్వీట్‌ చేశారు.