ఆ సినిమాని వెంకటేష్‌ రీమేక్‌ చేస్తున్నాడు!

విక్టరీ వెంకటేష్ వరుస సినిమాలకు కమిటయ్యారు. ఇప్పటికే బాబీ డైరెక్షన్లో నాగ చైతన్యతో కలిసి ‘వెంకీ మామ’ సినిమా చేస్తున్న ఆయన ఆ తర్వాత తరుణ్ భాస్కర్ డైరెక్షన్లో ఒక చిత్రం, త్రినాథ్ రావ్ నక్కిన దర్శకత్వంలో మరో చిత్రం చేయనున్నారు. ఇవి కాకుండా ఈమధ్యే విడుదలై మంచి విజయాన్ని సాధించిన బాలీవుడ్ చిత్రం ‘దే దే ప్యార్ దే’ను తెలుగులో రీమేక్ చేయనున్నారు. ఈ విషయాన్ని కొద్దిసేపటి క్రితమే నిర్మాత సురేష్ బాబు కన్ఫర్మ్ చేశారు. అయితే ఈ సినిమాను ఎవరు డైరెక్ట్ చేస్తారు అనేది మాత్రం ఇంకా తెలియాల్సి ఉంది.