ఆ తమిళ రీమేక్‌తో వెంకటేష్‌

తమిళ భాషల్లో విడుదలై విజయం సాధించిన సినిమాలను వెంకటేష్ ఎక్కువగా రీమేక్ చేసేవారు. ఇటీవల కాలంలో రీమేక్ ల సంఖ్య తగ్గిపోయింది. కాగా, బాలీవుడ్ లో సూపర్ హిట్టైన సినిమాను వెంకటేష్ ఇప్పుడు రీమేక్ చేయబోతున్నారు. అజయ్ దేవగణ్, టబు, రకుల్ లు జంటగా నటించిన దేదే ప్యార్ దే సినిమా బాలీవుడ్ లో మంచి విజయం సాధించింది.

ఇప్పుడు ఈ సినిమాను టాలీవుడ్ లో వెంకటేష్ రీమేక్ చేయబోతున్నారని సమాచారం. అజయ్ దేవగణ్ పాత్రలో వెంకటేష్ చేస్తున్నారట. సురేష్ బాబు బాలీవుడ్ నిర్మాతలతో చర్చలు జరపబోతున్నారని సమాచారం. టబు, రకుల్ ప్రీత్ సింగ్ పాత్రలలో ఎవరు చేస్తున్నారు అన్నది తెలియాలి.