రేడియో జాకీగా విద్యాబాలన్!

ఇప్పటివరకు నటి విద్యాబాలన్ చేసిన పాత్రలను కాకుండా కొత్తగా పాత్రతో ప్రేక్షకుల ముందుకు రావడానికి రెడీ అయిపోతుంది. అందాలను ఆరబోయాలన్నా.. నటిగా తన విశ్వరూపం చూపించాలన్న ఆ టాలెంట్ విద్యాబాలన్ కే సొంతం. అయితే ఇప్పటివరకు ఆమె కామెడీ పాత్రలను మాత్రం టచ్ చేయలేదు. ఇప్పుడు నేను ఎంత అల్లరి చేస్తానో.. త్వరలోనే మీరు తెరపై చూస్తారంటూ తను నటిస్తోన్న ‘తుమ్హారీ సులూ’ అంటూ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.
ఈ సినిమాలో ఆమె లేట్ నైట్ ఆర్.జె సులోచన పాత్రలో నటిస్తోంది. సులోచనను అందరూ ముద్దుగా ‘సులూ’ అని పిలుస్తారు. అనుకోకుండా రేడియో జాకీ అయిన సులోచనలో కోపం, బాధ, ప్రేమ ఎన్ని ఉన్నా.. కామెడీనే హైలైట్ అవుతుందట. ఈ పాత్ర తన కెరీర్ లో చాలా విభిన్నమైనదని చెబుతోంది ఈ బ్యూటీ. ఈ సినిమాతో పాటు ప్రస్తుతం ఆమె ‘బేగమ్ జాన్’ అనే మరో సినిమాలో నటిస్తోంది. రెండు విభిన్నమైన సినిమాల్లో ఒకేసారి నటిస్తున్నందుకు సంతోషాన్ని వ్యక్తం చేస్తోంది.