‘వార్‌’ టీజర్‌

బాలీవుడ్‌ సూపర్‌స్టార్స్‌ హృతిక్‌రోషన్‌, టైగర్‌ ష్రాఫ్‌ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న సినిమా ‘వార్’. ఈ చిత్రానికి సిద్ధార్థ్‌ ఆనంద్‌ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్ర టీజర్‌ను సోమవారం విడుదల చేశారు. భారీ యాక్షన్‌ సన్నివేశాలతో సినిమాను తెరకెక్కిస్తున్నట్లు టీజర్‌ను బట్టి తెలుస్తోంది. యాక్షన్‌కు పెట్టింది పేరు హృతిక్‌, టైగర్‌. అందులోనూ టైగర్‌.. హృతిక్‌కు వీరాభిమాని. ఇప్పుడు ఇద్దరూ తెరపై సందడి చేసేందుకు సిద్ధం కావడంతో అభిమానులు కూడా ఎగ్జైటింగ్‌గా ఫీలవుతున్నారు. యశ్‌రాజ్‌ ఫిలింస్‌ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రం గాంధీ జయంతి సందర్భంగా అక్టోబర్‌ 2న ప్రేక్షకుల ముందుకు రానుంది.