‘దఢక్‌’ మూవీ ట్రైలర్‌

దివంగత నటి శ్రీదేవి పెద్ద కుమార్తె జాన్వి హీరోయిన్‌గా నటించిన తొలి చిత్రం ‘దఢక్‌’. జాన్వి మొదటి చిత్రం కావడంతో అభిమానులతో పాటు సినీ ప్రముఖుల్లోనూ ఈ సినిమాపై ఆసక్తి నెలకొంది. అదీ కాకుండా మరాఠీలో బ్లాక్‌ బస్టర్‌ హిట్‌ అందుకున్న ‘సైరాట్‌’కు ఇది రీమేక్‌గా రాబోతోందని చిత్రబృందం ప్రకటించడంతో సినినిపై అంచనాలు పెరిగిపోయాయి. ఇందులో బాలీవుడ్‌ నటుడు షాహిద్‌ కపూర్‌ సోదరుడు ఇషాన్‌ ఖత్తర్‌ హీరోగా నటించాడు. ఫస్ట్‌లుక్‌తోనే జాన్వి ప్రేక్షకుల హృదయాలను దోచుకున్నారు. తాజాగా ఈ మూవీ ట్రైలర్‌ను విడుదల చేశారు.

ఈ ట్రైలర్‌లో ఇషాన్‌.. జాన్విని ప్రపోజ్‌ చేయాలనుకుంటాడు. దాంతో రణ్‌బీర్‌, కత్రినా నంటించి ‘అజబ్‌ ప్రేమ్‌ కీ గజబ్‌ కహానీ’ సినిమాలోని ‘తూ జానెనా’ పాట పాడతాడు. అది విని జాన్వి..’ఇంగ్లీష్‌ వచ్చన్నావ్‌గా.. ఇంగ్లీష్‌ పాట పాడు’ అంటుంది. దానితో ఇదే పాటను ఇంగ్లీష్‌లోకి అనువదించి పాడి ఆమె మనసు గెలుచుకుంటాడు. .జాన్వి..ఇషాన్‌కు ఐలవ్యూ చెబితే.. ఇందుకు ఇషాన్‌ ‘సిగ్గుగా ఉంది’ అనడం నవ్వులు పూయిస్తోంది. జాన్వికి ఇది తొలి సినిమానే అయినా చక్కగా నటించింది. ఇషాన్‌ ఈ సినిమాకు ముందే ‘బియండ్‌ ది క్లౌడ్స్‌’ అనే చిత్రంలో నటించాడు. ‘దఢక్‌’ చిత్రంలో ఇషాన్‌ పాత్ర పేరు మధు .. జాన్వి..పార్థవి పాత్రలో నటించారు. ప్రేమ, గొడవల నేపథ్యంలో ఈ సినిమాను తెరకెక్కించారు. అయితే సైరాట్‌ క్లెమాక్స్‌నే ఇందులోనూ చూపిస్తారా? లేక ఏమన్నా మార్పులు చేశారా? అన్నది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

శశాంక్‌ ఖైతాన్‌ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ధర్మ ప్రొడక్షన్స్‌ బ్యానర్‌పై కరణ్‌ జోహార్‌ నిర్మిస్తున్నారు. ఈ సినిమాలోకి జాన్వికి అవకాశం ఇచ్చింది కరణ్‌ జోహారే. చిత్రీకరణ సమయంలో శ్రీదేవి రోజూ కలిసి సెట్స్‌కు వెళుతుండేవారు. శ్రీదేవి హఠాన్మరణంతో కరణే దగ్గరుండి జాన్వి చేత సినిమా పూర్తి చేయించారు. అయితే తన తల్లి 25 నిమిషాల సినిమా చూశారని ఓ ఇంటర్యూలో జాన్వి వెల్లడించారు. అనంతరం మేకప్‌ మెలుకువలు, నటన గురించి టిప్స్‌ ఇచ్చారని పేర్కొన్నారు. జులై 20ప ‘దఢక్‌’ ప్రేక్షకుల ముందుకు రానుంది