ప్రభాస్ రిస్క్ తీసుకుంటాడా..?

ఇప్పుడు టాలీవుడ్ లో హాట్ టాపిక్ ప్రభుదేవా, ప్రభాస్ తో సినిమా చేస్తానని చెప్పడం. ఒకట్రెండు రోజులుగా ఈ వార్తపై రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అసలు విషయంలోకి వస్తే ప్రస్తుతం ప్రభాస్.. సుజీత్ దర్శకత్వంలో ‘సాహో’ అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ వచ్చే నాటికి పూర్తవుతుంది. ఆ తరువాత దర్శకుడు రాధాకృష్ణతో మరో సినిమా చేయడానికి కమిట్ అయ్యాడు ప్రభాస్. అయితే ఈ మధ్య మీడియాలో ఎదురైన ప్రశ్నకు సమాధానంగా ప్రభాస్ తో సినిమా చేయాలనుంది మంచి కథ దొరికితే ఖచ్చితంగా చేస్తా అన్నాడు.

సాధారణంగా ప్రెస్ మీట్స్ లో ఇటువంటి స్టేట్మెంట్స్ కామన్. గతంలో ప్రభాస్, ప్రభుదేవాలు కలిసి ‘పౌర్ణమి’ అనే సినిమాను రూపొందించారు. ఆ సినిమా పరాజయం పాలైంది. ఇక ప్రస్తుతం డైరెక్టర్ గా ప్రభుదేవా కెరీర్ అంతంతమాత్రంగానే ఉంది. సొంతంగా కథ సిద్ధం చేసుకొని హిట్ కొట్టిన సంధార్భాలు తక్కువ. మరి ఇప్పుడు ప్రభాస్ ఉన్న పరిస్థితుల్లో ప్రభుదేవాకు ఎంతవరకు ఛాన్స్ ఇస్తాడనేది అనుమానంగా మారింది. ఆయన రిస్క్ తీసుకునే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయని చెబుతున్నారు.