HomeTelugu Newsబెల్లంకొండ, కాజల్‌, తేజ సినిమా ఈ రోజే ప్రారంభం

బెల్లంకొండ, కాజల్‌, తేజ సినిమా ఈ రోజే ప్రారంభం

యంగ్‌ హీరో బెల్లంకొండ శ్రీనివాస్‌ కొత్త సినిమా మొదలైంది. తేజ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్‌ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. చిత్ర టైటిల్‌ను ఇంకా ఖరారు చేయలేదు. కాగా ఈ చిత్రంలో కాజల్‌ బెల్లంకొండకు జోడీగా నటించనున్నారు.ఈ రోజు (సోమవారం) ఈ చిత్రాన్ని లాంఛనంగా ప్రారంభించారు. ప్రముఖ దర్శకులు వి.వి. వినాయక్‌, శ్రీవాస్‌ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ చిత్రానికి వినాయక్‌ క్లాప్‌ కొట్టగా, శ్రీవాస్‌ కెమెరా స్విచ్చాన్‌ చేశారు.

2 10

ఈ సందర్భంగా తీసిన ఫొటోలను బెల్లంకొండ ట్విటర్‌ వేదికగా అభిమానులతో పంచుకున్నారు. వినాయక్‌, శ్రీవాస్‌కు ధన్యవాదాలు చెప్పారు. కాగా ఇప్పటీకే బెల్లంకొండ నటించిన ‘సాక్ష్యం’ సినిమా విడుదలకు సిద్ధమవుతోంది. ఇందులో పూజా హెగ్డే కథానాయిక. ఇటీవలే విడుదల చేసిన ఈ సినిమా ట్రైలర్‌కు మంచి స్పందన లభించింది. ఇక కాజల్‌ ప్రస్తుతం ‘క్వీన్‌’ తమిళ రీమేక్‌ ‘ప్యారిస్‌ ప్యారిస్‌’లో నటిస్తున్నారు. మరోపక్క ఆమె సంతోష్‌ శ్రీనివాస్‌ దర్శకత్వంలోనూ రవితేజ కథానాయకుడిగా చిత్రంలో నటించనున్నారు

Recent Articles English

Gallery

Recent Articles Telugu