HomeTelugu Newsఐపీఎల్ ఫైనల్లో రోబో2 టీజర్

ఐపీఎల్ ఫైనల్లో రోబో2 టీజర్

సంచలనాల దర్శకుడు శంకర్ సూపర్ స్టార్ రజనీకాంత్ కాంబినేషన్ లో దాదాపు 400 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిస్తున్న రోబో2 (2ఓ) చిత్రంపై సినీ జనాల్లో క్యూరియాసిటీ పెరిగిపోతుంది. ఈ చిత్రంలో అక్షయ్ కుమార్, అమీజాక్సన్ వంటి గ్రేట్ స్టార్స్ కూడా నటిస్తున్నారు. ఈ చిత్రం విడుదల ఆలస్యం కావడంతో ఇప్పటికే పలు రూమర్లు నడుస్తున్నాయి. ప్రస్తుతం గ్రాఫిక్స్ తో పాటు నిర్మాణానంతర పనులు జోరుగా సాగుతున్నాయి. ఇప్పటికే అమెరికన్ కంపెనీ చేసిన గ్రాఫిక్స్ నచ్చక దర్శకుడు శంకర్ వీటిని రీవర్క్ చేస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే ఈ సినిమా విడుదల రెండుసార్లు వాయిదా పడింది.

2 3

ప్రస్తుతం క్రికెట్ అభిమానులను ఓ ఊపు ఊపేస్తున్న ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ లో శంకర్ 2.0 టీజర్ ను రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తమిళ మీడియాలో కథనాలు నడుస్తున్నాయి. ఈ నెల 27న జరిగే ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ జరగనుంది. ఒకవేళ అదే జరిగితే ఈ చిత్రంపై వస్తున్న రూమర్లకు చెక్ పెట్టినట్లవుతుంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu