HomeTelugu Newsమెగాస్టార్‌ చిన్నఅల్లుడి సినిమా... ఫస్ట్‌ లుక్‌!

మెగాస్టార్‌ చిన్నఅల్లుడి సినిమా… ఫస్ట్‌ లుక్‌!

తెలుగు సినిమా అగ్ర కథానాయకుడు మెగాస్టార్‌ చిరంజీవి చిన్న అల్లుడు శ్రీజ భర్త కల్యాణ్‌ దేవ్‌ హీరోగా వెండితెరకు పరిచయం కాబోతున్న చిత్రం “విజేత”. ఈ సినిమా నిర్మాణానంతర కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. ఇటీవల టైటిల్‌ లోగో రిలీజ్‌తో ప్రమోషన్‌ పనులు ప్రారంభించిన చిత్రయూనిట్‌ తాజాగా సినిమాలో కల్యాణ్‌ దేవ్‌ లుక్‌ను రిలీజ్‌ చేస్తూ ఓ పోస్టరును రిలీజ్‌ చేశారు.

6 7

కాగా ఈ రోజు విడుదల చేసిన ఈ సినిమా ఫస్ట్‌లుక్‌ అందరినీ ఆకట్టుకుంటోంది. కల్యాణ్‌ వెనుక అటువైపు తిరిగి మురళీ శర్మ నిల్చుని ఉన్నారు. రాకేష్‌ శశి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా సాయి కొర్రపాటి నిర్మిస్తున్నారు. కల్యాణ్‌ సరసన మాళవిక నాయర్‌ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాకు… “అర్జున్‌ రెడ్డి” కి నేపథ్య సంగీతమందించిన హర్షవర్ధన్‌ రామేశ్వర్‌ సంగీతమందిస్తున్నారు. ఈ చిత్రం రొమాంటిక్‌ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతోంది. జులైలో ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu