HomeTelugu Big Storiesసింహాద్రికి పదిహేడేళ్లు.. వైరల్‌

సింహాద్రికి పదిహేడేళ్లు.. వైరల్‌

11 5

జూనియర్‌ ఎన్టీఆర్ ఇరవై యేళ్ల ప్రాయంలోనే ఓ సినిమాతో చరిత్ర సృష్టించాడు. సరిగ్గా మీసాలు కూడా రాని టైమ్‌లోనే బాక్సాఫీస్‌ను చీల్చి చెండాడాడు‌. జూనియర్ ఎన్టీఆర్ 2001 లో ‘నిన్ను చూడాలని’ సినిమాతో తొలిసారి హీరోగా నటించాడు. కానీ సింహాద్రి సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. తొలినాళ్లలోనే ఆది, సింహాద్రి వంటి ఇండస్ట్రీ హిట్లను కొట్టి తిరుగులేని హీరోగా నిలబడ్డాడు. ఈ చిత్రంలో భూమికా చావ్లా హీరోయిన్‌గా నటించింది.ఈ జంట కెమిస్ట్రీ తెరపై అద్భుతంగా పండింది. ప్రేక్షకులను ఎంతగానో ఆకర్షించింది. దర్శక ధీరుడు రాజమౌళి డైరెక్షన్‌లో వచ్చిన సింహాద్రి మూవీకి రేపటితో (జూలై 9) పదిహేడేళ్లు. వీరిద్దరి కాంబినేషన్‌ స్టూడెంట్ నెం.1 రెండో సినిమా. ఈ సందర్భంగా ఎన్టీఆర్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో కొత్త రికార్డులను క్రియేట్ చేస్తున్నారు.

నేడు సోషల్ మీడియా మొత్తం సింహాద్రి జపం చేస్తోంది. ఈ రోజు ఉదయం నుంచి సింహాద్రి హాట్ టాపిక్‌గా మారింది. చరిత్రకు పదిహేడేళ్లని సోషల్ మీడియాలో ఎన్టీఆర్ ఫ్యాన్స్ తెగ వైరల్‌ చేస్తున్నారు. ట్విట్టర్‌ ప్రపంచంలో కొంగొత్త రికార్డులకు నాంది పలుకుతున్నారు. ఫాస్టెస్ట్ మిలియన్ ట్వీట్స్.. కేవలం 53 నిమిషాల్లోనే మిలియన్ల ట్వీట్లను సంపాదించుకుంది. 17YearsForIHSimhadri అనే హ్యాష్ ట్యాగ్ ప్రస్తుతం దేశ వ్యాప్తంగా ట్రెండ్ అవుతోంది. ఇక జెట్ స్పీడ్‌లో ట్వీట్లు చేయడంతో వెంటనే 1.5 మిలియన్ల ట్వీట్లకు చేరుకుంది. NTR అంటే New Twitter Record అంటూ సింహాద్రి పదిహేడు వసంతాలను ఘనంగా సెలెబ్రేట్ చేస్తున్నారు. రాజమౌళి మాస్‌ను పీక్స్‌లో చూపిస్తే ఎలా ఉంటుందో ఓ చిన్న ఉదహరణే ఈ సింహాద్రి సినిమా. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షాన్ని కురిపించింది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!