హత్య కేసులో శ్రీరెడ్డి సంచలన కామెంట్స్

ప్రముఖ వ్యాపార వేత్త, ఎక్స్‌ప్రెస్ టీవీ అధినేత చిగురుపాటి జయరాం హత్య తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపిన సంగతి తెలిసిందే. ఈ కేసు విషయంలో వివాదాస్పద నటి శ్రీరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేసింది . జయరాం హత్య కేసులో ప్రధాన నిందితుడు రాకేష్ రెడ్డిని జూబ్లీహిల్స్‌ పోలీసుల కస్టడీలో ఉన్నారు. అయితే ఈ హత్య కేసులో అనేక అనుమానాలు ఉండటంతో జయరాం మేనకోడలు శిఖా చౌదరిపై పలు ఆరోపణలు వచ్చాయి. ఏపీ పోలీసులు ఆమెను విచారించి ఆమెకు క్లీన్‌చిట్ ఇచ్చినప్పటికీ ఆమెపై విచారణ కొనసాగుతోంది. మరోవైపు శిఖాచౌదరిపై జయరాం భార్య పద్మశ్రీ అనుమానం వ్యక్తం చేస్తూ జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి విదితమే.

జయరాం హత్యకేసులో వెలుగులోకి వచ్చిన శిఖా చౌదరి గురించి పలు ఆసక్తికరమైన విషయాలను మీడియా వెలుగులోకి తెచ్చింది. వరసకు మేనమామ అయిన జయరాంతో సన్నిహితంగా ఉండటం.. ఆమెకు గతంలో రెండు పెళ్లిళ్లు కావడం.. ప్రస్తుతం రాకేష్ రెడ్డితో ప్రేమాయణం.. జయరాం హత్య జరిగిన రోజు శేఖర్ అనే వ్యక్తితో శిఖాచౌదరి లాంగ్ డ్రైవ్‌కి వెళ్లడం ఇలా ఆమె గురించి మీడియాలో పలు కథనాలు వచ్చాయి.

సంచలనం రేపిన ఈ హత్య మిస్టరీపై వివాదాస్పద నటి శ్రీరెడ్డి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసింది. ఈ హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న శిఖా చౌదరికి మద్దతుగా నిలిచి హాట్ టాపిక్‌గా మారింది శ్రీరెడ్డి. టాలీవుడ్ క్యాస్టింగ్ కౌచ్ అంశంతో సంచలనం రేపిన శ్రీరెడ్డి ప్రస్తుతం చెన్నైలో మకాం పెట్టింది. కొంతకాలంగా అక్కడే ఉంటున్న శ్రీరెడ్డి.. అకస్మాత్తుగా హైదరాబాద్‌లో ప్రత్యక్షమైంది. ముఖానికి ముసుగు ధరించి ఎవరికీ కనిపించకుండా చార్మినార్ పరిసర ప్రాంతాల్లో ఫ్రెండ్స్‌తో కలిసి హల్‌చల్‌ చేసింది. ఈ ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది.