HomeTelugu Trending'మా' సభ్యత్వం రద్దుపై కరాటే కళ్యాణి స్పందన

‘మా’ సభ్యత్వం రద్దుపై కరాటే కళ్యాణి స్పందన

karate kalyani reacts to ma

టాలీవుడ్ నటి కరాటే కళ్యాణి తరచు ఏదో ఒక వివాదంలో చిక్కుకుంటుంది. తాజాగా దివంగత ఎన్టీఆర్ విగ్రహం గురించి ఆమె చేసిన వ్యాఖ్యలు ఆమెను ఇరకాటంలోకి నెట్టేశాయి. ఖమ్మంలో ఎన్టీఆర్ శత జయంతిని పురస్కరించుకుని ఎన్టీఆర్ భారీ విగ్రహాన్ని ఆవిష్కరించబోతున్నారు. ఎన్టీఆర్ విగ్రహాన్ని శ్రీకృష్ణుడి రూపంలో తయారు చేశారు. దీనిపై కల్యాణి అభ్యంతరం వ్యక్తం చేసింది. హిందువులు పవిత్రంగా పూజించే శ్రీకృష్ణుడి రూపంలో ఎన్టీఆర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయడాన్ని ఆమె తప్పుపట్టారు. దేని కోసం ఎన్టీఆర్ ను దేవుడిని చేస్తున్నారని ప్రశ్నించారు.

ఈ వ్యాఖ్యలు ఆమెను చిక్కుల్లో పడేశాయి. కళ్యాణిపై మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. వివాదాస్పద వ్యాఖ్యలపై వివరణ ఇవ్వాలని ఆమెకు షోకాజ్ నోటీసు ఇచ్చింది. అయితే, నిర్ణీత గడువులోగా ఆమె వివరణ ఇవ్వక పోవడంతో అసోసియేషన్ నుంచి ఆమె సభ్యత్వాన్ని రద్దు చేశారు.

దీనిపై కళ్యాణి ఆవేదన వ్యక్తం చేశారు. తాను ఏం తప్పు చేశానో అర్థం కావడం లేదని అన్నారు. ఎన్టీఆర్ విగ్రహానికి తాను వ్యతిరేకం కాదని… అయితే, కృష్ణుడి రూపంలో విగ్రహం పెట్టడాన్ని మాత్రమే వ్యతిరేకించానని చెప్పారు. ప్రతి హీరోకి దేవుడి రూపంలో విగ్రహాలు పెడితే ఇక దేవుళ్లు ఎందుకని ప్రశ్నించారు. అనారోగ్యం కారణంగా నోటీసుల పట్ల స్పందించలేకపోయానని… ఇంతలోనే తనను సస్పెండ్ చేస్తున్నట్టు ప్రకటించారని ఆవేదన వ్యక్తం చేశారు. 23 ఏళ్లుగా ఇండస్ట్రీలో ఉన్న తనకు మంచి గిఫ్ట్ ఇచ్చారని వ్యాఖ్యానించారు. తన సభ్యత్వాన్ని రద్దు చేసినా తాను ఇండస్ట్రీని వదిలి వెళ్లనని… ఇక్కడే ఉంటానని చెప్పారు. ఎవరో తనపై కుట్ర చేశారని ఆరోపించింది.

‘బిచ్చగాడు 2’ ట్రైలర్‌

అనుష్క ‘మిస్‌ శెట్టి మిస్టర్‌ పొలిశెట్టి’ టీజర్‌

సాయి ధరమ్ తేజ్ విరుపాక్ష మూవీ ట్రైలర్‌: భయం కలిగించే చాలా సన్నివేశాలు

బట్టలు లేకుండా హట్‌ లుక్‌లో విద్యాబాలన్‌

హీరోయిన్ శ్రద్ధా దాస్ ఎక్స్ పోజింగ్ విషయంలో అసలు ఎక్కడ తగ్గేదే లేదు

శిల్పా శెట్టి రోజుకో డ్రెస్సుతో ఫోటో షూట్, ముప్పై ఏళ్లుగా అవే అందాలు

Follow Us on FACEBOOK   TWITTER

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!