ప్రభాస్ సినిమాపై అనుష్క కామెంట్‌

యంగ్‌ రెబెల్‌స్టార్‌ ప్రభాస్‌ హీరోగా తెరకెక్కుతోన్న మరో భారీ బడ్జెట్ మూవీ సాహో. దీనికి సంబంధించిన ఓ కొత్త పోస్టర్‌ విడుదలైంది. దీనిపై హీరోయిన్ అనుష్క శెట్టి స్పందించారు. పోస్టర్‌ను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేస్తూ తన అభిప్రాయాన్ని వెల్లడించారు. ఈ సినిమా నుంచి వస్తున్న ప్రతి అంశం.. ఆ తర్వాత ఏంటి? అన్న ఆలోచనలో పడేస్తోంది. ప్రతిసారీ సినిమాపై అంచనాలు పెరిగిపోతున్నాయి. ఆగస్ట్‌ 15 కోసం ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నా. ప్రభాస్‌కు, యూవీ క్రియేషన్స్‌కు, సుజిత్‌కు, బృందంలోని ప్రతి టెక్నీషియన్‌కు ఆల్‌ ది బెస్ట్‌. ఎగ్జైటెడ్‌ అని పేర్కొన్నారు.

యూవీ క్రియేషన్స్‌ సంస్థ నిర్మించిన భాగమతి చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన అనుష్క ఏడాది పాటు విరామం తీసుకుని తన తదుపరి సినిమాకు సంతకం చేశారు. ఆమె ప్రధాన పాత్రలో సైలెన్స్‌ చిత్రం తెరకెక్కుతోంది. హేమంత్‌ మధుకర్‌ దర్శకత్వం వహిస్తున్నారు. మాధవన్‌, అంజలి, షాలినీ పాండే, సుబ్బరాజు, అవసరాల శ్రీనివాస్‌ కీలక పాత్రలు పోషిస్తున్నారు.