HomeTelugu Trendingనెగిటివ్‌ పాత్రలో భూమిక!

నెగిటివ్‌ పాత్రలో భూమిక!

11 16
పవన్ కల్యాణ్, భూమిక చావ్లా నటించిన ‘ఖుషి ‘సినిమాను అంత ఈజీగా మర్చిపోలేరు. ఈ సినిమాలో పవన్, భూమిక మధ్య వచ్చే ప్రతిసీను హైలెట్ అనే చెప్పాలి. టాలీవుడ్ లో ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా రాణించింది భూమిక. వరుసగా పవన్, మహేష్, ఎన్టీఆర్ లతో నటించి సూపర్ హిట్లు అందుకుంది. దాదాపు అందరు హీరోల సరసన నటించిన భూమిక, ఆతర్వాత లేడీ ఓరియెంటెడ్ సినిమాలు కూడా చేసింది .. ఆ తర్వాత పెళ్లి చేసుకొని పూర్తిగా సినీ ఇండస్ట్రీకి దూరం అయ్యింది ఈ బ్యూటీ . తాజాగా ఆమె ‘ఎం ఎస్ ధోని’ సినిమాతో రీఎంట్రీ ఇచ్చారు. తెలుగులో నాని నటించిన ‘ఎం.సి.ఏ’ సినిమాలో నటించారు. తాజాగా బాలకృష్ణ నటించిన ‘రూలర్’ సినిమాలో కూడా భూమిక నటించారు. తాజా సమాచారం ప్రకారం భూమిక త్వరలో నెగిటీవ్ షేడ్స్ ఉన్న పాత్రలో నటించనున్నట్లు తెలుస్తుంది. ప్రస్తుతం భూమిక చేతిలో రెండు సినిమాలు ఉన్నాయి. ఈ మధ్య ఒక ఇంటర్వ్యూలో నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలంటే ఇష్టమని ‘మిస్సమ్మ’లో నా పాత్ర అలానే సాగుతుందని చెప్పుకొచ్చింది. ఈ సారి అలా కాకుండా పూర్తిగా నెగిటివ్ షేడ్స్ అంటే లేడీ విలన్ లా అని చెప్పింది భూమిక. ఇక ఈ సినిమాలో ఓ స్టార్ హీరో నటిస్తున్నాడట. ఈ సినిమాకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!