అభిమానులకు షాకిచ్చిన అమితాబ్‌ న్యూ లుక్‌


బాలీవుడ్‌ మెగాస్టార్‌ అమితాబ్‌ బచ్చన్ (76) మరోసారి తన ఫ్యాన్స్‌ను ఆశ్చర్యంలో ముంచెత్తారు‌. పొడవాటి గడ్డం, కళ్ళజోడు, వెరైటి తలపాగా, ప్రొస్థెటిక్ ముక్కుతో ఓల్డ్ మాన్ లుక్‌లో గుర్తుపట్టలేనంతగా బిగ్ బి ఫ్యాన్స్‌కు షాక్‌ ఇచ్చారు. దర్శకుడు శూజిత్‌ సర్కార్‌ తెరకెక్కిస్తున్న ‘గులాబో సితాబో’ సినిమాలో అమితాబ్‌ గెటప్‌ ఇది. ఇందులో ఆయుష్మాన్‌ ఖురానా ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమా కోసం అమితాబ్‌కు ప్రోస్తెటిక్‌ మేకప్‌ వేశారు.

ఈ మేకప్‌ వేయించుకోవడానికి తాను చాలా అలసిపోయేవాడినని అమితాబ్‌ మీడియా ద్వారా వెల్లడించారు. ఈ సినిమాలో అమితాబ్‌ లఖ్‌నవూకు చెందిన ఓ కోపిష్ఠి ఇంటి యజమాని పాత్రలో నటిస్తున్నారు. అయితే ఇందులో అమితాబ్‌ లుక్‌ ఎలా ఉండబోతోందో ముందుగానే శూజిత్‌ పేపర్‌పై బొమ్మ గీసి బిగ్‌బికి చూపించారట. ఈ బొమ్మ చూడగానే అమితాబ్‌ సినిమాలో నటించేందుకు ఒప్పుకొన్నారు. ఫ్యామిలీ డ్రామా కామెడీ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమా 2020 ఏప్రిల్‌ 24న ప్రేక్షకుల ముందుకు రానుంది.