HomeTelugu Trendingఅవినాష్‌కు ముద్దు పెట్టిన మోనాల్‌

అవినాష్‌కు ముద్దు పెట్టిన మోనాల్‌

monal kiss to avinashబిగ్‌బాస్‌లో నిన్న ఎపిసోడ్‌లో నామినేషన్స్‌ జరిగాయి. ప్రతిసారీలాగానే ఇప్పడు కూడా మోనాల్‌ పేరు ప్ర‌స్తావించారు. పైగా నువ్వు పెద్ద త‌ప్పు చేశావ్‌ అంటూ అభిజిత్‌ వేలెత్తి చూప‌డం ఆమె త‌ట్టుకోలేక‌పోయింది. ప్ర‌తివారం నామినేష‌న్ లాగే ఈసారి ఏడ్చేసింది. దీంతో ఆమె బాధ‌ను పోగొట్టేందుకు అఖిల్ అభితో మాట్లాడేందుకు సిద్ధ‌మ‌య్యాడు. ఆమెను న‌వ్వించే యత్నం చేశాడు అవినాష్.

“నువ్వు మారిపోయావు, ఛీ ఛీ” అంటూ అల‌క న‌టించాడు. దీంతో ప‌క్క‌న అఖిల్ ఉన్నాడ‌న్న విష‌యం కూడా మ‌ర్చిపోయి మోనాల్ ప‌రుగెత్తుకుంటూ వెళ్లి అవినాష్ నుదుటిపై ముద్దు పెట్టింది. దీంతో ప‌క్క‌నే ఉన్న అరియానా షాక్ తింది. ఇక‌ ఊహించ‌ని ఆఫ‌ర్ ద‌క్కినందుకు అవినాష్‌ ఆనందంతో ఉబ్బిత‌బ్బిబ్బ‌‌య్యాడు. నా పొలంలో మొల‌క‌లొచ్చాయ్ అంటూ డ్యాన్స్‌ చేశాడు. మోనాల్ దృష్టిలో ఏ అంటే అవినాష్‌, అందుకే నాకు ముద్దు పెట్టింది అంటూ ఎగిరి గంతులేశాడు. ఇక ఈ ప్రోమో చూసిన ప్రేక్షకులు అవినాష్‌తో ఉంటే మోనాల్‌కు ఏడ‌వాల్సిన ప‌నే ఉండ‌ద‌ని అంటున్నారు.

క్లాప్ బోర్డ్‌తో గుత్తాజ్వాల స్పెషల్ ఇంటర్వ్యూ

Recent Articles English

Gallery

Recent Articles Telugu