
బిగ్‌బాస్-4 తెలుగులో ఈ రోజు సోమవారం కావడంతో నామినేషన్స్ ప్రక్రియ మొదలైంది. అవినాష్ తప్ప అంతా అరియానానే నామినేట్ చేసినట్లు ప్రోమో చూస్తుంటే అర్థమైపోతుంది. హారిక, మోనాల్, సోహెల్ అయితే అరియానాతో గొడవ పెట్టుకున్నారు. అరవొద్దు అరియానా అంటే నేనింతే అరుస్తా అంటూ సమాధానమిచ్చింది. మరోవైపు మోనాల్‌ను ఫేక్ అంటూ సంచలన కామెంట్స్ చేసింది. సోహెల్‌ను కూడా టార్గెట్ చేసి అరిచేసింది. అయితే వాళ్లంతా రివర్స్‌లో అరియానాను టార్గెట్ చేశారు.
టాస్క్ విషయంలో కూడా చాలా రెచ్చిపోయి ఆడుతుంది అరియానా. గతవారం మోనాల్ దగ్గర అరియానా చేసిన రచ్చ చూస్తుంటే వామ్మో అనుకుంటారు. ఐస్ వాటర్ తీసుకుని ఏకంగా మొహంపై బలంగా కొట్టేసింది అరియానా. ఆ తర్వాత నాగార్జున కూడా ఈ విషయంపై సీరియస్ అయ్యాడు. అరియానాతో పాటు హారిక, అభిజీత్, మోనాల్ కూడా ఈ వారం నామినేషన్స్‌లో ఉన్నట్లు కనిపిస్తున్నారు.
Nomination process start…Break the bottle #BiggBossTelugu4 today at 9:30 PM on @StarMaa pic.twitter.com/IXGOPJZkhl
— starmaa (@StarMaa) November 9, 2020













