మజిలీని రీమేక్ చేయబోతున్నారా?

టాలీవుడ్ లో ఈ ఏడాది విడుదలైన సినిమాల్లో రెండు బ్లాక్ బస్టర్ హిట్ సాధించాయి. అందులో ఒకటి ‘ఎఫ్ 2’ కాగా, రెండో సినిమా ‘మజిలీ’. మజిలీ హిట్ అవుతుందని ఊహించారుగాని, ఈ స్థాయిలో హిట్ అవుతుందని ఎవరు ఊహించలేదు. నాగచైతన్య కెరీర్లో ఈ సినిమా ది బెస్ట్ గా నిలిచింది.

నాగచైతన్య పాత్రను డిజైన్ చేసిన తీరు అమోఘం. అటు సమంత యాక్టింగ్ కూడా ఈ సినిమాకు ప్లస్ పాయింట్ అయ్యింది. ఈ సినిమా కోలీవుడ్ రైట్స్ ను ధనుష్ నిర్మాణ సంస్థ వుండర్బర్ ఫిలిమ్స్ సంస్థ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను డబ్బింగ్ చేసి రిలీజ్ చేయకుండా… రీమేక్ చేసే ఆలోచనలో ధనుష్ ఉన్నాడని సమాచారం. గతంలో రఘువరన్ బిటెక్ సినిమా కూడా ఫెయిల్యూర్ స్టోరీగా వచ్చి సూపర్ హిట్టైంది. మజిలీని కూడా తమిళంలో రీమేక్ చేస్తే బాగుంటుందనే ఆలోచనలో ఉన్నారట. మరి ఈ రీమేక్ లో ధనుష్ నటిస్తారో లేదంటే మరెవరైనా చేస్తారో చూడాలి.