ఎదురుపడ్డ చంద్రబాబు, పవన్.. ఆ తరువాత ఏం జరిగిందంటే

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఎదురుపడ్డారు..! అసలే ఎన్నికల సమయంలో ఆరోపణలు, విమర్శలతో పొలిటికల్ హీట్ పెంచిన నేతల రియాక్షన్ ఏంటి? అనే ఉత్కంఠ అందరిలోనూ ఉంది. అయితే.. ఆ ఇద్దరు నేతలు నవ్వుతూ పలకరించుకున్నారు. సరదాగా కాసేపు ముచ్చటించుకున్నారు. ఈ ఘటనకు రామోజీరావు మనవరాలు కీర్తి వివాహం వేదికలో జరిగింది. కీర్తి వివాహ వేదికపై చిరునవ్వులు చిందించారు. ఇద్దరు నేతలు.. వధువు, వరూలను ఆశీర్వదించిన చంద్రబాబు.. తిరిగి వెళ్తున్న సమయంలో ఆయనకు పవన్ కల్యాణ్ ఎదురయ్యారు. వెంటనే వీరిద్దరు నవ్వుతూ ఒకరినొకరు పలకరించుకున్నారు. నమస్కారాలు చేసుకుంటూ కాసేపు ముచ్చటించుకున్నారు. ఇక చంద్రబాబుకు బర్త్ డే సందర్భంగా పవన్ కల్యాణ్ విషెస్ చెప్పారు. మొత్తానికి చంద్రబాబు బర్త్ డే రోజు … ఇద్దరు నేతలు ఇలా కలుసుకున్నారు.