HomeTelugu Newsభారత్‌లో తొలి కరోనా కేసు నమోదు

భారత్‌లో తొలి కరోనా కేసు నమోదు

15 5
ప్రస్తుతం ప్రపంచాన్ని వణికిస్తున్న ప్రాణాంతకమైన కరోనా వైరస్‌ భారత్‌లోకి ప్రవేశించింది. కేరళకు చెందిన ఓ విద్యార్థికి కరోనా వైరస్‌ సోకినట్టుగా వైద్యులు గుర్తించారు. ఆ విద్యార్థి కి వైద్య పరీక్షలు నిర్వహించగా కరోనా వైరస్‌ పాజిటివ్‌గా తేలింది. ప్రస్తుతం ఆ విద్యార్థికి కేరళలోని ఓ ఆస్పత్రిలో ప్రత్యేక విభాగంలో ఉంచి వైద్యం అందిస్తున్నారు. ఈ విషయాన్ని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ కూడా ధ్రువీకరించింది. అయితే ప్రస్తుతం విద్యార్థి ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని.. ప్రత్యేక వార్డులో ఉంచి పరిశీలిస్తున్నామని
వైద్యులు వెల్లడించారు. ఆ విద్యార్థి చైనాలోని వుహాన్‌ యూనివర్సిటీలో మెడిసిన్‌ చదువుతున్నట్లు తెలిపారు.

మరోవైపు చైనాలో ఉన్నత విద్య, ఉద్యోగం కోసం వెళ్లిన 23 వేలమందికి పైగా భారతీయ విద్యార్థులను స్వదేశానికి తీసుకురావడానికి విదేశాంగ శాఖ ప్రయత్నాలు చేస్తోంది. అలాగే చైనా నుంచి వచ్చే ప్రయాణికులను పరీక్షించటానికి ఎయిర్‌పోర్ట్‌లలో ప్రత్యేకంగా స్ర్కీనింగ్ సెంటర్లను ఏర్పాటు చేశారు. ఇప్పటికే కరోనా మహమ్మారి బారినపడి చైనాలో
170 మంది మృతిచెందారు. వందలాది మంది ఆస్పత్రిలో చికిత్సపొందుతున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu