ఎన్టీఆర్ సినిమాలో బ్యాన్ చేసిన నటుడు..?

ఎన్టీఆర్, బాబీ దర్శకత్వంలో ‘జై లవకుశ’ అనే సినిమా రూపొందుతోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో ఎన్టీఆర్ త్రిపాత్రాభినయం చేస్తున్నాడు. ప్రస్తుతం సినిమా షూటింగ్ దశలో ఉంది. తాజాగా ఈ సినిమాలో విలన్ పాత్ర కోసం కన్నడ హీరోను రంగంలోకి దింపుతున్నారని తెలుస్తోంది. ఆయన మరెవరో కాదూ దునియా విజయ్.

వాస్తవానికి ఓ సినిమా షూటింగ్ లో సరైన జాగ్రత్తలు తీసుకోకుండా ఇద్దరు స్టంట్ మాస్టర్స్ చావుకు కారనామిన దునియా విజయ్ పై కన్నడ ఫిల్మ్ ఇండస్ట్రీ బ్యాన్ విధించింది. దీంతో గత కొన్ని రోజులుగా దునియా విజయ్ సినిమాలకు దూరంగా ఉంటున్నాడు. ఈ సమయంలో ఎన్టీఆర్ పిలిచి మరీ ఆయన అవకాశం ఇవ్వడంతో హాట్ టాపిక్ అయింది. మరి ఈ విషయంలో ఎన్టీఆర్ పై కన్నడ ప్రజలు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తారేమో.. చూడాలి!

CLICK HERE!! For the aha Latest Updates