HomeTelugu Trendingత్వరలోనే సెట్స్‌పైకి ఎఫ్‌3 మూవీ

త్వరలోనే సెట్స్‌పైకి ఎఫ్‌3 మూవీ

F3 movie pre production wor

విక్టరీ హీరో వెంక‌టేష్‌, వ‌రుణ్ తేజ్ ప్ర‌ధాన పాత్ర‌ల్లో నటించిన ఎఫ్‌2 మూవీ ఎంతటి విజయం సాధించిందో తెలిసిందే. అనిల్ రావిపూడి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో త‌మ‌న్నా, మెహ‌రీన్‌లు హీరోయిన్లుగా న‌టించారు. శ్రీ వెంకటేశ్వర సినీ క్రియేషన్స్‌లో దిల్ రాజు నిర్మించిన ఈ చిత్రానికి అనిల్ రావిపూడి దర్శకత్వం వహించారు. ఈ సినిమా గత ఏడాది సంక్రాంతి కానుక‌గా విడుద‌లైంది. ఇప్పుడు ఈ సినిమా సీక్వెల్ ను ప్లాన్ చేస్తున్నాడు అనిల్ రావిపూడి. ఇప్పుడు ఎఫ్‌3 అంటూ ముగ్గురు హీరోలను ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా ఎప్పుడెప్పుడు మొదలవుతుందా అని ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. కరోనా కారణంగా వాయిదా పడిన ఈ సినిమా షూటింగ్ త్వరలోనే సెట్స్‌పైకి వెళ్లనుంది. అన్నీ కుదిరితే వచ్చే జనవరి నుంచి ఈ చిత్రం షూటింగ్ ప్రారంభించాలని దర్శకుడు భావిస్తున్నారట. దీనికి సంబంధించిన ప్రి-ప్రొడక్షన్ పనులను ప్రారంభించినట్లు తెలుస్తోంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!