చార్మినార్‌, కొండారెడ్డి బురుజు పై సమంత యోగా.. ఫన్నీ మీమ్స్‌


అక్కినేని సమంత చైతూతో పెళ్లి తర్వాత మరింత గ్లామరస్‌గా తన కెరీర్‌లో హిట్‌లతో దూసుకుపోతూ ఉంది. ఆమె ఫిట్‌నెస్ విషయంలో చాలా స్ట్రిక్ట్‌గా ఉంటారు. ప్రతీరోజూ ఉదయం యోగ చేస్తూ.. సాయంత్రం జిమ్‌లో చెమటలు చిందిస్తూ.. వర్క్ అవుట్స్ చేస్తూనే ఉంటుంది.

లాక్‌డౌన్ సమయాన్ని బాగా వినియోగంచుకుంటుంది సమంత. ఇంటికే పరిమితమైన ఈ బ్యూటీ.. కుటుంబ సభ్యులతో బిజీ ఉంటోంది. కొత్త వంటలు నేర్చుకోవడంతోపాటు.. యోగా, ఆసనాలు వేస్తున్న ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తోంది.

అయితే సామ్ చేసిన పోస్టింగ్స్‌ను ఆమె అభిమానులు ఫన్నీ మీమ్స్‌ చేసి సోషల్‌మీడియాలో షేర్ చేస్తున్నారు. చార్మినార్‌, కొండారెడ్డి బురుజు సెంటర్‌లపై సమంత యోగాసనం చేసినట్లు క్రియేట్‌ చేశారు. అలాగే స్పెడర్‌ మ్యాన్‌ పోస్టర్‌ను సమంత ఆసనాలతో రీడిజైన్‌ చేశారు. ‘స్పైడర్‌ సమంత’ అంటూ వీటిని సోషల్ మీడియాలో షేర్‌ చేయడంతో అవి కాస్తా.. వైరల్‌ అవుతున్నాయి.

CLICK HERE!! For the aha Latest Updates