ప్రభాస్, మోహన్ బాబు ఫన్నీ వీడియోటాలీవుడ్ డైలాగ్ కింగ్.. మోహన్‌బాబు, డార్లింగ్ ప్రభాస్‌లు ఇద్దరూ వెండితెరపై కలిస్తే ఎలాంటి సందడి ఉంటుందో.. ‘బుజ్జిగాడు’లో చూశాం. మరి బయట వారు కలిస్తే ఎలా ఉంటుందో చూశారా? ఇదిగో ఈ వీడియోలో ఉన్నట్లు చాలా ఫన్నీగా ఉంటుంది. వయసులో, నటనలో సీనియర్ అయిన మోహన్‌బాబు.. ప్రభాస్‌తో కలిసి సందడి చేశారు. ఇటీవల వారిద్దరూ కలిసి మాట్లాడుకుంటున్న వీడియో సామాజిక మాధ్యమాల వేదికగా చక్కర్లు కొడుతోంది.
ఇంతకీ ఆ ఫన్నీ సంభాషణ ఏంటో తెలుసా? మోహన్‌బాబు, ప్రభాస్‌ల మధ్య వారి ముక్కుకు సంబంధించి చర్చ వచ్చింది. దీంతో ప్రభాస్ మాట్లాడుతూ.. తన ముక్కు చాలా పదునుగా ఉంటుందని, చిన్నప్పుడు దానితో టమోటాలు కోశానని అంటూ, ‘మీరేం కోశారు’ అని మోహన్‌బాబును అడిగారు. మోహన్‌బాబు ఆశ్చర్యపోతూ చూస్తూ.. ‘కోడి మెడ కోశా’ అంటూ సమాధానం ఇవ్వడంతో నవ్వుల పువ్వులు పూశాయి. మరి డైలాగ్ కింగ్ అంటే ఆ మాత్రం పంచ్ ఉండాలి కదా!
మోహన్‌బాబు, ప్రభాస్‌లు కలిసి పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన ‘బుజ్జిగాడు’ చిత్రంలో నటించిన సంగతి తెలిసిందే. 2008లో వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుంది.
Their Bonding ♥#Prabhas #Mohanbabu pic.twitter.com/kk8zEzq3aS
— Shreyas Group (@shreyasgroup) November 21, 2019